Bhimaa : గోపీచంద్ మాస్ రచ్చ.. వర్కింగ్ డే లో ‘గామి’ ని మించిపోయిందిగా..!

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా ఎన్నో భారీ అంచనాలతో థియేటర్ల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మాత్రం మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. అయితే గోపీచంద్ గత చిత్రాల కంటే బెటర్ గా ఉండడంతో ఓ మోస్తరు జనాలు ఈ సినిమాని ఆదరిస్తున్నారు. భీమా రిలీజ్ అయ్యాక వాటి ఓపెనింగ్స్ మాత్రం ఆశాజనకంగా రాలేదు. గోపీచంద్ గత సినిమాల ప్రభావం భీమా పై గట్టిగా పడగా, దీనికి పోటీగా కూడా ఇతర సినిమాలు కూడా రిలీజ్ కావడంతో భీమా ఓపెనింగ్స్ తక్కువగా వచ్చాయి. అయితే ఉన్నంతలో భీమా మాస్ ఏరియాలలో సాలిడ్ ఓపెనింగ్స్ తెచ్చుకుందని చెప్పొచ్చు.

గామి ని బీట్ చేసేసింది..

ఇక భీమా సినిమా తో పాటు మహాశివరాత్రి రోజు విశ్వక్ సేన్ నటించిన గామి, అలాగే డబ్బింగ్ సినిమా ప్రేమలు కూడా రిలీజ్ అయ్యాయని తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు కూడా భీమా కంటే మంచి టాక్ తెచ్చుకోవడంతో భీమా కి పెద్ద దెబ్బ పడింది. అయితే మాస్ ప్రేక్షకులకు భీమాయే ఫస్ట్ ఆప్షన్. కానీ నిజం చెప్పాలంటే టాలీవుడ్ హీరోలలో మాస్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో ఒకరైన గోపీచంద్ హిట్ కొట్టి ఆల్ మోస్ట్ 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పటికీ మాస్ లో గోపీచంద్ మూవీస్ కి మంచి ఓపెనింగ్స్ సొంతం అవుతాయి. భీమా కి హిట్ టాక్ కనుక సొంతం అయ్యి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత బెటర్ కలెక్షన్స్ సొంతం అయ్యి ఉండేవి. హైదరాబాద్ వంటి ఏరియాల్లో భీమా కి యావరేజ్ కలెక్షన్లు వచ్చినా, బిసి సెంటర్లలో మంచి కలెక్షన్లు వచ్చాయి. పైగా వర్కింగ్ డేస్ లో భీమా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తూ ఉండటం విశేషం. అయితే తాజాగా భీమా వర్కింగ్ డే లో ఏకంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గామి కంటే ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం.

- Advertisement -

గోపీచంద్ మాస్ క్రేజ్..

మామూలుగా సండేతో పోల్చితే మండే ఏ సినిమా అయినా కూడా ఆల్ మోస్ట్ 70% రేంజ్ లో డ్రాప్ అవుతూ ఉంటాయి… కానీ భీమా మూవీ సండేతో పోల్చితే మండే మాత్రం కేవలం 40% రేంజ్ లోనే డ్రాప్ అయ్యింది. పైగా మిక్సుడ్ టాక్ తో అన్ సీజన్ లో వర్కింగ్ డే లో 60% కలెక్షన్స్ తో హోల్డ్ చేయడం అన్నది విశేషం. ఇక వర్కింగ్ డే లో దీంతో పాటు రిలీజ్ అయిన గామి కి పాజిటివ్ టాక్ వచ్చినా 70% వరకు డ్రాప్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో భీమా 4 వ రోజు 54 లక్షల షేర్ వసూలు చేస్తే, గామి 51 లక్షల షేర్ వసూలు చేసింది. దీన్ని బట్టి మాస్ లో గోపీచంద్ కి ఉన్న క్రేజ్ పవర్ కి ఇదే నిదర్శనం అని చెప్పాలి. ఒక్కసారి సరైన మూవీ గోపీచంద్ కి పడాల్సి ఉంది. అయితే ఏది ఏమైనా భీమా కి వచ్చే వసూళ్లు వీకెండ్ లోనే వచ్చి ఉండాల్సింది. ఎప్పుడు ఎంత హోల్డ్ చేసినా బ్రేక్ ఈవెన్ అంటే కష్టమే అనిపిస్తుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు