WAR2 : 100 రోజులు.. 100 కోట్లు..

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కబోయే క్రేజీ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ క్రేజీ మూవీ “వార్ 2” కూడా ఒకటి. నిజానికి కొన్ని నెలల ముందు వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వార్ ఒక సాదా సీదా కమర్షియల్ సినిమాలా ఉంటుంది. పైగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టే రేంజ్ లో ఏమి బ్లాక్ బస్టర్ కాలేదు. ఒక మామూలు సూపర్ హిట్టు సినిమా. అయితే ఈ సినిమా సీక్వెల్ ప్రకటించాక ఎప్పుడైతే సీక్వెల్ లో యంగ్ టైగర్ ఎంటర్ అయ్యాడో అప్పటినుండి మూవీ పై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. RRR తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్ లో కూడా పెరిగిపోయింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ప్రకటించాక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో సినిమా అంటే ఊహించడానికే సూపర్ గా ఉండగా, ఈ సినిమా గురించి వచ్చే ప్రతీ అప్డేట్ కూడా ఇండియా వైడ్ గా ట్రెండ్ అయి కూర్చుంటుంది. అలాగే ఈ సినిమా గురించి వచ్చిన తాజా అప్డేట్ నెట్టింట ట్రెండ్ అవుతుంది.

100 రోజుల డేట్లు..

భారీ పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ వార్2 మీద అంచనాలు సాలిడ్ గా ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ఎన్టీఆర్ మొదటి సారిగా నటించబోతున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. టాలీవుడ్ తో పాటు టోటల్ ఇండియా వైడ్ గా క్రేజ్ సాలిడ్ గా ఏర్పడగా, రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలు అయిందని సమాచారం. అయితే ముందుగా షూటింగ్ లో హృతిక్ రోషన్ పాల్గొంటాడని, అతి త్వరలో ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం వార్ 2 సినిమా కోసం ఇద్దరు హీరోలు కూడా భారీగా బల్క్ డేట్స్ ఇచ్చారట. బాలీవుడ్ వర్గాల వార్తల ప్రకారం, వార్ 2 కోసం ఎన్టీఆర్ ఏకంగా 100 రోజుల కాల్ షీట్స్ ఇవ్వగా, హృతిక్ రోషన్ కూడా 100 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట. ఇద్దరు హీరోలకి సమంగా వర్కింగ్ డేస్ ఉండటంతో రెండు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

100 కోట్ల రెమ్యూనరేషన్ అట..

వార్ 2 సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్ ఇంకా హృతిక్ రోషన్ లు ఏకంగా 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోకున్నారని టాక్ నడుస్తుంది. దీంతో ఈ సినిమా బడ్జెట్ లెక్కలు ఇప్పటికే 400 కోట్లు దాటిపోయాయట. ఇక షూటింగ్ పూర్తయ్యే లోపు ఐదు వందల కోట్ల వరకు వెళ్లొచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే మూవీ కి ఇద్దరు హీరోలు ఇచ్చిన వంద రోజుల కాల్షీట్లు సరిగ్గా వాడుకుంటే బడ్జెట్ సక్రమంగా సరిపోతుందని లేదా పరిధి దాటిపోతుందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మార్చి 19న గోవా లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ షెడ్యూల్ పూర్తికాగానే వార్ 2 సెట్స్ లో ఎన్టీఆర్ అడుగుపెడతాడని సమాచారం. ఏది ఏమైనా వార్ 2 గనుక హిట్టయితే బాలీవుడ్ లో ఎన్టీఆర్ చక్రం తిప్పడం ఖాయమని చెప్పాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు