War -2: బాలీవుడ్ నే శాసిస్తున్న ఎన్టీఆర్ రెమ్యునరేషన్..!

RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ గానే పెరిగిపోయింది.. ఇప్పుడు ఎన్టీఆర్ తో బాలీవుడ్ స్టార్స్ సైతం కలిసి పనిచేయడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు.. మరొకపక్క ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా మొదటిసారి తెలుగు తెరకు పరిచయం కాబోతున్నది.. బాలీవుడ్ లో కూడా మొదటిసారి వార్-2 చిత్రంతో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా పైన ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా అభిమానులు అలర్ట్ అయిపోతున్నారు.. ఈ నేపథ్యంలోనే వార్ -2 సినిమాలో విలన్ గా చేస్తున్న ఎన్టీఆర్ కి ఈ పాత్ర కోసం బడా బ్యానర్ ఎంత రెమ్యునరేషన్ ఇవ్వబోతోంది అనే విషయం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది..

ఎన్టీఆర్ రెమ్యునరేషన్:
అయితే బాలీవుడ్ మీడియా నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ కి రూ .100 కోట్ల వరకు ఈ ప్రాజెక్టు కోసం ఇవ్వబోతున్నట్లు సమాచారం.. ఈ విషయం తెలిసి హిందీ స్టార్స్ కుళ్ళుకుంటున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మరోవైపు ఎన్టీఆర్ కి ఈ రెమ్యునరేషన్ ఒకేసారి పే చేయకుండా రాపిడ్ షేరింగ్ పద్ధతిలో ఈ రెమ్యూనరేషన్ ఇచ్చే విధంగా ప్లాన్ చేశారట.. ఈ మేరకు ఎన్టీఆర్ కూడా అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దక్షిణాది నుంచి YRF బ్యానర్ లో సౌత్ నుంచి ఒక స్టార్ హీరోని తీసుకురావడం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి.. ఇక రెమ్యునరేషన్ కూడా RRR సినిమాతో వచ్చిన క్రేజ్ కి కంపేర్ చేస్తూ ఇస్తున్నట్లు తెలుస్తోంది .

ఎన్టీఆర్ తదుపరి చిత్రాలు..
ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివతో సినిమా అయిపోయిన వెంటనే తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయబోతున్నారు. బాలీవుడ్ లో స్పై యూనివర్స్ వార్ -2 సినిమాలు చేయబోతున్నారు.. ఈ క్రమంలోనే ఒకసారి ఎన్టీఆర్ స్పై యూనివర్స్ లోకి చేరిపోతే..రానున్న రోజుల్లో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ తదితర హీరోల సినిమాలలో కూడా నటించే అవకాశం ఉంటుందంటున్నారు అభిమానులు.. ఎందుకంటే స్పై యూనివర్స్ లో సల్మాన్ ఖాన్ , షారుఖ్ ఖాన్ , హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వార్ -2 చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.

- Advertisement -

షూటింగ్లో పాల్గొనబోతున్న ఎన్టీఆర్..
ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మార్చి 7న జపాన్లో టోక్యోలోని ఒక చారిత్రాత్మక టెంపుల్లో ప్రారంభం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో షూటింగ్ కోసం ఎన్టీఆర్ ఏప్రిల్ నుంచి జాయిన్ కాబోతున్నారట. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఆస్ట్రేలియా సినిమాటోగ్రాఫర్ బెన్ జన్పర్ పనిచేయబోతున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు కి రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.. మరి వార్ -2 చిత్రంతో ఏ విధంగా ఎన్టీఆర్ కెరియర్ ని మలుపు తిప్పుకుంటారు చూడాలి మరి. ఒకవేళ తన నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగితే బాలీవుడ్ ని ఎన్టీఆర్ శాసిస్తారు అనడంలో సందేహం లేదు.

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు