Priyamani: లైంగిక వేధింపులకు గురైన ప్రియమణి..!

ప్రముఖ నటి ప్రియమణి హీరోయిన్ గా కొన్ని సినిమాలలో నటించినా.. పెద్దగా సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యింది. అలా పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి భారీ సక్సెస్ అందుకున్న ఈమె ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతోంది. ఒకవైపు బుల్లితెర డాన్స్ షోలకి జడ్జిగా వ్యవహరిస్తూనే.. మరొకవైపు నారప్ప వంటి సినిమాలలో కీలకపాత్రలు పోషించి మరింత పేరు దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన గురించి తాజాగా పంచుకుంది..

ఇంటర్వ్యూలో ప్రియమణి..
తాజాగా ఒక తమిళ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియమణి లైంగిక వేధింపుల గురించి తన చెత్త అనుభవాలను మీడియాతో పంచుకుంది.. ప్రియమణి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా కెరియర్ ను మొదలు పెట్టినప్పుడు కొత్తలో ఒక దర్శకుడు నన్ను అడగకుండానే నేరుగా నా బెడ్ రూమ్ లోకి వచ్చేసాడు.. దాంతో అరచి గోల పెడితే అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది.. అలాగే మరో సంఘటనను కూడా ఆమె గుర్తు చేసుకుంది. హీరోయిన్గా చేస్తున్న రోజుల్లో మా చిత్ర బృందంతో కలిసి నేను విమానంలో ప్రయాణిస్తున్నాను. ఒక బిజినెస్ మెన్ నా పక్కనే వచ్చి కూర్చున్నారు.. మీతో కలిసి వెకేషన్ కి రావాలని ఉంది అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు.. మొదట నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.. అంతలోనే ఒక బ్లాంక్ చెక్ తీసి నాకు ఇచ్చారు.. దేనికి ఇస్తున్నారు అని అడిగితే నాతో పాటు మీరు రావడానికి అని బదులిచ్చాడు.. ఆ మాటతో నాకు కంపరం పుట్టుకొచ్చింది..అంటూ ప్రియమణి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి వెల్లడించింది..

క్యాస్టింగ్ కౌచ్ పై మరోసారి స్పందన..
ఇకపోతే సినీ లోకంలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎంతోమంది హీరోయిన్లు తమకు జరిగిన చీకటి అకృత్యాలను బయట పెట్టిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో సంఘటన గురించి ఆమె మాట్లాడుతూ.. ఒక తమిళ దర్శకుడు తో నేను సినిమా చేస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. ఆ దర్శకుడు లైంగికంగా నన్ను బాగా వేధించేవాడు. మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టాడు అంటూ తాను తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా నోరు విప్పింది ప్రియమణి.. ఈ విషయాలన్నీ తెలిసి ప్రియమణి అభిమానులు తనను ఇంత బాధకు గురి చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ప్రియమణి వ్యక్తిగత జీవితం..
ప్రియమణి వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. అప్పటికే వివాహమైన ముస్తఫాను ప్రేమించి వివాహం చేసుకున్న ఈమె.. అప్పట్లో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది.. ముస్తఫా మొదటి భార్య నుంచి పలు ఇబ్బందులను కూడా చవిచూసిన ఈమె.. ఇప్పుడు పిల్లల్ని కనకపోవడం పై పలు ట్రోల్స్ కూడా ఎదుర్కొంటోంది. ఏది ఏమైనా అప్పుడు , ఇప్పుడు కెరియర్ పరంగా , వ్యక్తిగత జీవితంపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటోంది ప్రియమణి.

Check out Filmify for the latest Bollywood Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Bollywood, Hollywood, Tollywood, Mollywood, and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు