Ananya Nagalla : వేణు స్వామితో అనన్య ప్రత్యేక పూజలు… ఇదే కారణమా?

ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు ముఖ్యంగా హీరోయిన్లు వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా హీరోయిన్ అనన్య నాగళ్ళ కూడా ఆయనతో స్పెషల్ గా పూజలు చేయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ బ్యూటీ ప్రత్యేక పూజలకు కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

అనన్య సినిమా ఎంట్రీ…
అనన్య నాగళ్ళ ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ను మొదలు పెట్టింది. 2019లో రిలీజ్ అయిన మల్లేశం సినిమాతో అనన్య కెరీర్ హీరోయిన్ గా టర్న్ అయింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ తరువాత ప్లే బ్యాక్ అనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి ట్రై చేసింది. కానీ పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో ప్రధాన పాత్రను పోషించే ఛాన్స్ దక్కించుకుంది. దీంతో అనన్యకు ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ సినిమాలో అనన్య చేసింది సపోర్టింగ్ రోల్ అయినప్పటికీ మంచి పాపులారిటీ దక్కింది. ఇక వకీల్ సాబ్ తర్వాత అనన్య కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ను తలకిందులు చేస్తూ అనన్యకు అసలు ఆఫర్లే రాలేదు. దీంతో చిన్నా చితకా సినిమాలు చేస్తూ కాలం వెళ్ళబుచ్చింది. మాస్ట్రో, శాకుంతలం వంటి సినిమాల్లో కూడా సపోర్టింగ్ రోల్స్ కే పరిమితం అయిపోయింది. తాజాగా “తంత్ర” అనే కొత్త సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది బ్యూటీ.

“తంత్ర”తో హార్రర్ జానర్ లోకి…
ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైన అనన్య నాగళ్ళ ఇప్పుడు “తంత్ర” అంటూ భయపెట్టే ప్రయత్నం చేయబోతోంది. ఈ సినిమాలో అనన్యతో పాటు సలోని, మీసాల లక్ష్మణ్, టెంపర్ వంశీ తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు. శ్రీనివాస్ గోపిశెట్టి ఈ హారర్ మూవీకి దర్శకత్వం వహించారు. “తంత్ర” మూవీని ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ మార్చ్ 15న థియేటర్లలోకి రాబోతోంది.

- Advertisement -

వేణు స్వామితో స్పెషల్ పూజలు…
ప్రస్తుతం అనన్య పొట్టేల్ అనే సినిమాతో పాటు తంత్ర అనే మరో మూవీ కూడా చేస్తోంది. తన కొత్త సినిమా “తంత్ర” మూవీ మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలోనే అనన్య నాగళ్ళ వేణు స్వామితో కలిసి ప్రత్యేక పూజలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. పైగా ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న కాన్సెప్ట్ క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కడం మరో ఇంట్రెస్టింగ్ అంశం. కాగా ఈ మూవీ హిట్ కావాలని కోరుకుంటూ అనన్య నాగళ్ళ వేణు స్వామితో తాజాగా ఈ స్పెషల్ పూజలు చేయించినట్టు తెలుస్తోంది. మరి ఈ పూజల తరువాత అయినా అనన్య కెరీర్ ఫుల్ స్టాప్ లేకుండా పరిగెడుతుందా? ఆ పూజల ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చి 15 వరకు వెయిట్ చేయక తప్పదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు