Anushka : భారీ స్కెచ్ వేసిన అనుష్క.. అందుకే మెగాస్టార్ కి కూడా నో..!

Anushka : ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసి భారీ క్రేజ్ దక్కించుకుంది. సూపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె ఆ తర్వాత అరుంధతి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకొని తెలుగు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క(Anushka) ఆ తర్వాత నిశ్శబ్దం , భాగమతి వంటి సినిమాలు చేసింది.. చివరిగా సైజ్ జీరో సినిమాతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు.. ఈ సినిమా కోసం పూర్తిగా బరువు పెరిగిన అనుష్క తన పూర్వ వైభవాన్ని పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది.. ఈ క్రమంలోని సినిమా అవకాశాలు కోల్పోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. అయితే గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ని సొంతం చేసుకుంది.. ఇక ఇప్పుడు వరుస సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడానికి తన మేకోవర్ లో మార్పు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది..అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

భారీ స్కెచ్ వేసిన అనుష్క..

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత మరో తెలుగు ప్రాజెక్టు ప్రకటించలేదు.. దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయంలోకి వెళ్తే అనుష్క(Anushka) ఇకమీదట తన సినిమా కెరియర్ పైన దృష్టి పెట్టిందని.. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం. అరుంధతి సినిమాతో సంపాదించుకున్న క్రేజ్ కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది.. కానీ ఇప్పటికే అనుష్క అంటే తెలుగు ప్రేక్షకులకు అభిమానమే.. అంతే కాదు అనుష్క తప్పకుండా తన పాత్రకి ఎక్కువ విలువ ఉండే చిత్రాలే ఒప్పుకుంటుందని అభిమానులకు నమ్మకం కూడా.. అందుకే అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఫిక్స్ అయ్యిందట ఈ ముద్దుగుమ్మ..

అందుకే చిరంజీవి మూవీ కి నో..

ఈ క్రమంలోనే చిరంజీవి సినిమాకి నో చెప్పినట్లు సమాచారం.. చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో కూడా త్రిష కంటే ముందు ఆ పాత్రకు అనుష్కని అనుకున్నారట.. అయితే ఆ సినిమాలో ఆ పాత్రకి స్కోప్ లేకపోవడం..పైగా మెయిన్ హీరోయిన్ తనే అయినప్పటికీ మరో 5 మంది హీరోయిన్స్ స్క్రీన్ షేర్ చేసుకునే కథ కావడంతో అనుష్క చిత్రాన్ని రిజెక్ట్ చేసినట్లు సమాచారం. తాను సొంత కుటుంబంగా భావించే యువీ క్రియేషన్స్ బ్యానర్ పైన విశ్వంభర సినిమాను నిర్మిస్తున్నారు .. అవకాశం వచ్చింది చిరంజీవి తరఫున అయినా సరే బాగా ఆలోచించి సున్నితంగా నో చెప్పిందట ఈ ముద్దుగుమ్మ..

- Advertisement -

అయినా అండగా ప్రేక్షకులు..

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాని రిజెక్ట్ చేసినా కూడా ఈమె సరైన నిర్ణయమే తీసుకుందని అభిమానులు అండగా నిలిచారు..

అనుష్క సినిమాలు..

ఇక ప్రస్తుతం అనుష్క క్రిష్ దర్శకత్వంలో ఘాటి అనే సినిమా ప్రకటించింది.. వేదం సినిమాలో వేశ్యగా తనలోని ఉత్తమ నటిని బయటకు తీసిన దర్శకుడు క్రిష్ ను మరోసారి నమ్మింది.. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మొదటి లుక్ చూస్తేనే ఈ చిత్రంలో అనుష్క ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తోందో అర్థమవుతుంది.. ఈ కథ చూస్తే అమాయకంగా అనుష్క పాత్ర మొదలై గంజాయి వ్యాపారంలో మాఫియా స్థాయికి ఎదిగిన ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ లో కనిపించనుందని సమాచారం..పైగా పెర్ఫార్మెన్స్ కి ఎక్కువ అవకాశం ఉండటమే కాకుండా సినిమా కథ మొత్తం ఈమె చుట్టూనే తిరిగేది కావడంతో అనుష్క సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.. మరోవైపు మలయాళం డెబ్యూ కథనర్ లో కూడా నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు