Chandini Chowdary : అతడి వల్ల రెండేళ్లు నష్టపోయాను.. చాందిని ఘాటు వ్యాఖ్యలు..!

Chandini Chowdary : షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలు పెట్టి కేటుగాడు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మను సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకొని.. కలర్ ఫోటో సినిమాతో యూత్ లో క్రేజీ సంపాదించుకున్న తెలుగు బ్యూటీ చాందిని చౌదరి(Chandini Chowdary) ప్రస్తుతం విశ్వక్ సేన్ తో కలిసి గామి చిత్రంలో పెద్దపెద్ద సాహసాలే చేసింది. ఇక అలా పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్లో రెండు సంవత్సరాలు ఒక నిర్మాత వల్ల నష్టపోయాను అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఈ క్రమంలోనే అసలు ఏమి జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

నిర్మాత వల్ల నష్టపోయాను..

సమయం ఎంతో విలువైనది.. సినిమా పరిశ్రమలో దాని విలువ మరింత ఎక్కువ ..అయితే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.. కానీ నేను అలా తెలుసుకోకపోవడం వల్లే ఒక నిర్మాత వల్ల రెండు సంవత్సరాల సమయం వృధా చేసుకున్నాను.. లేకుంటే ఈపాటికి ఇంకా మంచి స్థాయిలో ఉండేదాన్ని అంటూ తెలిపింది చాందిని చౌదరి(Chandini Chowdary).. అయితే ఆ నిర్మాత ఎవరు ? ఆ నిర్మాత వల్లే తాను ఎందుకు సినిమాలు చేయలేదు? అన్న విషయంపై మాత్రం ఈ ముద్దుగుమ్మ క్లారిటీ ఇవ్వలేదు.

నన్ను నేను నియంత్రించుకోలేను..

కొన్ని కథలు విన్నప్పుడు నన్ను నేను నియంత్రించుకోలేను.. గామి సినిమా కూడా అలాంటిదే.. ఈ కథ విన్నప్పుడే ఈ చిత్రంలో తప్పకుండా భాగం కావాలని ఫిక్స్ అయ్యాను.. మామూలుగా అయితే ఒక కథకు ఓకే చెప్పడానికి నేను చాలా సమయం తీసుకుంటాను.. కానీ గామి సినిమా కథ విన్నప్పుడు అసలు ఆలోచించలేదు.. ఓకే చెప్పేసాను.. ఇప్పుడు ఈ సినిమా నా మనసుకి చాలా తృప్తిని ఇచ్చింది.. గామి ప్రయాణం అంతా ఒక సాహసోపేతం అయినది.. హిమాలయాల్లో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ చేశాము.. అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా విశ్వక్ , నేను ఆక్సిజన్ ట్యాంక్స్ పట్టుకొని వెళ్లి నటించాల్సి వచ్చేది.. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో రోప్స్ సహాయంతో వేలాడటం, కొండల మీద నుంచి దూకడం లాంటి సాహసాలు కూడా చేశాము.. ఇంత సాహసమైన పాత్ర నాకు దక్కడం నిజంగా నాకు సంతోషాన్ని ఇచ్చింది అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

అదే లక్ష్యంగా ముందుకు వెళ్తాను..

ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలనే లక్ష్యంతోనే పనిచేస్తాము.. అందుకోసం ఎంతో కష్టపడతాము కూడా.. ముఖ్యంగా జయాపజయాలు మన చేతుల్లో ఉండవు.. కథకు తగ్గట్టు డైరెక్టర్ చెప్పినట్టు.. మన శక్తికి మించి నటించడమే కావాలి.. వాటితో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి.. అప్పుడే సక్సెస్ అవుతాము.. అదే నా సిద్ధాంతం అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయ్యాయి.. ఇకనైనా గామి లాంటి అద్భుతమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నారు అభిమానులు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు