Meena : రెండో పెళ్లిపై హీరోయిన్ మీనా క్లారిటీ

Meena : మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమందికి మాత్రమే మంచి పేరు వస్తూ ఉంటుంది. కొంతమంది ఎదగడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్లు తక్కువ కాలంలో పాపులర్ అవుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో మీనా(Meena) ఒకరు. హీరోయిన్ మీనా(Meena) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

మద్రాస్ లో జన్మించిన హీరోయిన్ మీనా(Meena)… 1982 సంవత్సరంలో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. అనంతరం శివాజీ గణేషన్ తో పాటు రజనీకాంత్ సినిమాలలో నటించింది. తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది హీరోయిన్ మీనా. తెలుగే కాకుండా హిందీ, మలయాళం భాషలలో కూడా చిన్న వయసులోనే నటించింది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గాని దాదాపు 50 సినిమాలలో చేసింది హీరోయిన్ మీనా.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీతారామయ్యగారి మనవరాలు సినిమాతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత చంటి, సుందరకాండ సినిమాలలో నటించింది. సౌందర్య లాంటి క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంపాదించుకుంది హీరోయిన్ మీనా. అయితే 2009 సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను మీనా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికీ ఒక కూతురు పుట్టిన తర్వాత మొన్న కరోనా సమయంలో హీరోయిన్ మీనా భర్త మరణించాడు.

- Advertisement -

దీంతో తన కూతుర్ని ఎంతో కష్టపడి పెంచుతోంది హీరోయిన్ మీనా.

ఇలాంటి తరుణంలో హీరోయిన్ మీనా త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని కొంతమంది వార్తలు ప్రచారం చేశారు. అంతేకాదు తమిళ హీరో ధనుష్ ను హీరోయిన్ మీనా పెళ్లాడబోతుందని చెబుతున్నారు. అయితే ఈ వార్తలపై హీరోయిన్ మీనా స్పందించారు. డబ్బు కోసం ఏమైనా చేస్తారా.. ఏదైనా రాస్తారా అంటూ ఫైర్ అయింది. వాస్తవ వార్తలు రాస్తే మంచిది.. నాలా ఒంటరిగా జీవించే మహిళలు చాలామంది ఉన్నారు. నా పేరెంట్స్ మరియు కుమార్తె భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి అని వేడుకుంది. ప్రస్తుతానికి రెండవ పెళ్లి ఆలోచన లేదని… అంటే కచ్చితంగా తానే స్వయంగా చెబుతానని మీనా వెల్లడించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు