Dhanush : సైలెంట్ గా లాంచ్ చేసారు.. దగ్గరుండి ఆయనతోనే!

కోలీవుడ్ స్టార్ ధనుష్ వరుస సినిమాలతో జోరు మీదున్నాడు. ఈ ఇయర్ సంక్రాంతికి ఆల్రెడీ కెప్టెన్ మిల్లర్ తో మెప్పించిన ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కుబేర మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అలాగే స్వీయ దర్శకత్వంలో రాయన్ సినిమా కూడా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అవి సెట్స్ పై ఉండగానే ముచ్చటగా మూడో సినిమా కూడా మొదలుపెట్టేశాడు. ఇక ఈ సినిమా అలా మొదలుపెట్టడంతోనే సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ప్రేక్షకులు మినిమం గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు. ఆ సినిమా పేరు ఇళయరాజా.. అవును.. మీరు విన్నది నిజమే.. ధనుష్ చేస్తుంది మాస్ట్రో ఇళయరాజా బయోపిక్. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇళయరాజా బయోపిక్..

ఇళయరాజా అంటే సౌత్ ఇండస్ట్రీ లోనే తెలియని వారు బహుశా ఉండరేమో. ఆయన సంగీతం వింటే చాలు. మైమరిచిపోతాం. ఒక రకంగా సంగీతం తో ప్రేమలో పడిపోతాం. అయితే దాదాపుగా ప్రతీ సంగీతాభిమాని ఇళయరాజాకు ఫ్యానే. 1970లో సంగీత ప్రయాణాన్ని మొదలు పెట్టిన మ్యాస్ట్రో ఇళయరాజా.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ తో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఎన్నో వందల చిత్రాలకు మ్యూజిక్ అందించారు. ఎన్నో అవార్డులు రివార్డులు కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఏకంగా 1400 వందలకు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించి రికార్డు క్రియేట్ చేశారు ఇళయారాజా. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. 80 ఏళ్ల వయసులో కూడా తన మ్యూజిక్ తో ఇప్పటికి అలరిస్తున్నారు. అయితే చాలా రోజుల నుండి ఇళయరాజా బయోపిక్ తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. పైగా ధనుష్ ఈ బయోపిక్ లో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే నేటితో అఫిషియల్ గా అనౌన్స్ చేసి లాంచ్ కూడా చేసేసారు.

- Advertisement -

ఇళయరాజా కమల్ హాసన్ చేతులమీదుగా..

ధనుష్ హీరోగా ‘ఇళయారాజా’ టైటిల్ తోనే మ్యూజిక్ మ్యాస్ట్రో బయోపిక్ ను అనౌన్స్ చేశారు. ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అని ఉపశీర్షిక. ధనుష్ ఇళయరాజా రోల్ లో యాక్ట్ చేస్తుండగా, కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక పాన్ ఇండియా లెవెల్ లో రూపొందిస్తున్నారు. తాజాగా పూజా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయగా కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి టైటిల్ పోస్టర్ ను లాంఛ్ చేశారు. ఈ పోస్టర్ లో చెన్నై రోడ్ల మీద ఇళయరాజా హార్మోనియం పెట్టె పట్టుకుని ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంది. ఈ మూవీని పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా భాషల నటీనటులు టెక్నిషియన్స్ అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అయితే 2025లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.

ఆయనకు ఆయనే సాటి అందుకే?

అయితే ఇళయరాజా బయోపిక్ కి సంబంధించిన టెక్నిషియన్స్ అందర్నీ రివీల్ చేసిన మేకర్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం ఇళయరాజానే పెట్టుకుంటున్నారట. అంటే తన బయోపిక్ కు తానే మ్యూజిక్ అందించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకి ఆయనే పర్ఫెక్ట్ అని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఈ జనరేషన్ సంగీత దర్శకుల్ని తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బయోపిక్ కి ఆయనే మ్యూజిక్ అంటే వినడానికి ఏదోలా ఉందని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ చిత్రం పై మాత్రం ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు