Suriya : కంగువా పీరియాడిక్ మూవీ కాదా? అసలు మ్యాటర్ ఇది?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమిళ మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా ”కంగువ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. తెలుగు తమిళ్ లో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడు శివ ఇప్పుడు సూర్య హీరోగా కంగువ లాంటి భారీ చిత్రం చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ అయినపుడు శివ గత చిత్రాల వల్ల ఒక మామూలు కమర్షియల్ మాస్ సినిమాగానే ఈ సినిమా కూడా తెరకెక్కుతోందని అనుకున్నారు. కానీ ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇంతకు ముందే ఫస్ట్ లుక్ టీజర్ తో మంచి క్రేజ్ తెచ్చుకోగా, తాజాగా కంగువ మూవీ నుండి సిజిల్ పేరుతో ఒక టీజర్ ని వదిలారు. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయని చెప్పొచ్చు.

పీరియాడిక్ డ్రామా కాదు?

ఇక ఈ టీజర్ లో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో పాటు, సూర్య పాత్ర మరియు బాబీ డియోల్‌ పాత్రలతో వారి తెగల మధ్య వార్ అన్నట్టుగా చూపించారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచడం ఖాయం అంటూ తమిళ మీడియా వారు తెగ కథనాలు రాస్తున్నారు.అయితే ఈ కథనాల్లో భాగంగానే ఒక కొన్ని నెగిటివ్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా టీజర్ లో మరియు పబ్లిసిటీ స్టఫ్ లో ఇప్పటి వరకు సినిమా కు సంబంధించి పీరియాడిక్‌ మూవీ అన్నట్లు చూపిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా వస్తున్న వార్తల ప్రకారం ఇది పీరియాడిక్ డ్రామా కాదని, శివ మార్క్ లో ఒక కమర్షియల్ సినిమా అని వార్తలు వస్తున్నాయి. కంగువ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఈ స్టోరీ అని కొందరు అంటుంటే, సూర్య ద్విఅత్రాభినయం చేస్తున్నాడని, అందులో ఒకటి కంగువా అని, రెండో రోల్ ఇంకా చూపించలేదని అంటున్నారు. కానీ ఇదే సినిమాలో సమకాలీనంగా, అంటే సగం సినిమా మొత్తం ఇప్పటి కమర్షియల్ సన్నివేశాలు ఉంటాయట. పైగా ఆ సన్నివేశాలు గోవాలో చిత్రీకరించారట. ఆ విషయాన్ని గతంలో నిర్మాత అధికారికంగా ప్రకటించాడు. కానీ ఇప్పటి వరకు అలాంటి సన్నివేశాల తాలూకు లుక్ కానీ, షాట్స్ కానీ విడుదల చేయలేదు.

- Advertisement -

ముందే చెప్పేస్తే బాగుండేది?

అయితే తాజాగా రిలీజ్ అయిన టీజర్‌ లో ఆ విషయాలను కాస్త అయినా టచ్‌ చేసి ఉంటే బాగుండేదని నెటిజన్లు భావిస్తున్నారు. ఎందుకంటే సినిమా పై ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయంను క్రియేట్‌ చేసిన టీజర్‌ లో ఆ విషయాలను చూపించక పోవడం వల్ల, రిలీజ్ అయ్యాక సినిమా చూసే సమయంలో ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘నా పేరు సూర్య’ చిత్రం పక్కా ఆర్మీ బ్యాక్ డ్రాప్ సినిమా అని చెప్పి, కమర్షియల్ సినిమాగా రిలీజ్ చేశారు. దీంతో ఆ సినిమా కంటెంట్ బాగున్నా ప్లాప్ అయింది. ఇక కంగువ విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్న కారణంగా మరో టీజర్ విడుదల చేయడంతో పాటు ట్రైలర్ విడుదల చేయాల్సి ఉంటుంది. అందులో అయినా ఇప్పటి వరకు దాచిన విషయాలను రివీల్‌ చేస్తూ మేకర్స్‌ సస్పెన్స్ కి తెర దించుతారేమో చూడాలి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు