Kanguva Teaser Talk : సూర్య మాస్ విశ్వరూపం…

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమిళ మాస్ డైరెక్టర్ శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ”కంగువ”. ఈ సినిమాపై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దర్శకుడు శివ ముందుగా తెలుగు ఆడియన్స్ కే డైరెక్టర్ గా సుపరిచితం కావడం విశేషం. ఆయన దర్శకత్వం లో తెలుగులో వచ్చిన శౌర్యం, శంఖం, లాంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇకపోతే తమిళ్ లో అజిత్ తో వేదాళం, వీరం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి మాస్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు సూర్య హీరోగా కంగువ లాంటి భారీ చిత్రం చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ అయినపుడు శివ గత చిత్రాల వల్ల ఒక మామూలు కమర్షియల్ మాస్ సినిమాగానే ఈ సినిమా కూడా తెరకెక్కుతోందని అనుకున్నారు. కానీ ఫస్ట్ లుక్ గ్లిమ్ప్స్ తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు మంచి స్పందన లభించింది. పైగా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న కంగువ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే తాజాగా కంగువ మూవీ నుండి సిజిల్ పేరుతో ఒక టీజర్ ని వదిలారు.

సూర్య మాస్ అవతార్ లో..

కాసేపటికిందే రిలీజ్ అయిన కంగువ స్పెషల్ టీజర్ సూర్య ఫ్యాన్స్ ని విపరీతంగా మెప్పిస్తుంది. ఒక నిమిషం లోపే నిడివి ఉన్న టీజర్ సినీ ప్రేక్షకులకు మాంచి సినిమాటిక్ ఎక్సీపిరియెన్స్ అందించే విజువల్ వండర్ గా ‘కంగువ’ తెరకెక్కిందని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఇక టీజర్లో పెద్దగా కథ గురించి డీటెయిల్స్ ఇవ్వలేదు గాని, ‘పెరుమాచ్చి’ అంటూ సూర్య గర్జించే ఒకే ఒక్క డైలాగ్ తో కట్ చేయబడిన ఈ టీజర్ ఫ్యాన్స్ తో పాటు ఇండియా వైడ్ గా కామన్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటోంది. ఇక కండువా టీజర్ లో యాక్షన్ సీన్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్ రేంజ్ లో నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని చెప్పొచ్చు. దీనికి తోడూ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.
ఇక ఈ సినిమా టైటిల్ ‘కంగువ’, అంటే తమిళంలో అగ్నిలా దేన్నైనా దహించే శక్తి కలిగినవాడు, అత్యంత పరాక్రమవంతుడు అనే అర్థాలు ఉన్నాయట. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు టీజర్ లో సూర్యను ఒక మాస్ అవతార్ లో క్రూరుడిలా ప్రెజెంట్ చేశారు.

- Advertisement -

ఇక ఈ సినిమాలో బాబీ డియోల్‌ విలన్ పాత్రలో ఇంటన్స్‌ లుక్‌ లో కనిపించారు. ఆయన క్యారెక్టర్ ను కూడా ఎంతో పవర్ ఫుల్ గా, హీరో పాత్రకు ధీటుగా ఉండేలా డిజైన్ చేసినట్లు ‘కంగువ’ టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇక టీజర్లో చూపించిన దాన్ని బట్టి వీరిద్దరూ రెండు వేర్వేరు తెగలకు నాయకులు అయి ఉంటారని తెలుస్తుంది. ఇక ఇద్దరి మధ్య హోరాహోరి పోరు కూడా జరగబోతోందని టీజర్ చివర్లో షాట్ తో హింట్ ఇచ్చారు. అయితే ఇందులో సూర్య, బాబీ డియోల్ తప్ప ఇతర ప్రధాన పాత్రదారులెవరికీ ఈ టీజర్ లో చోటు కల్పించలేదు.

టెక్నికల్ గానూ..
ఇక కంగువ టీజర్ టెక్నికల్ గానూ చాలా రిచ్ గా ఉందని చెప్పొచ్చు. వరల్డ్ క్లాస్ మేకింగ్, గ్రాండియర్ విజువల్స్ తో ‘కంగువ’ టీజర్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. అయితే టీజర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమాలు చూసే రెగ్యులర్ ఆడియన్స్ కి పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ లాంటి హలీవుడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. ఇక ‘కంగువ’ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్, పెన్ స్టూడియోస్ సంస్ధలు 300 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కాగా, కె. జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఇక ‘కంగువ’ సినిమాని భారతీయ భాషల్లోనే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో మొత్తం పది భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి కంగువ సినిమాతో సూర్య పాన్ ఇండియా స్థాయిలో ఏ రేంజ్ రచ్చ చేస్తాడో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు