Nani32 : ఈ ఏడాదేనంటున్నారు.. అది ఆ ఒక్కరిపైనే డిపెండ్ అయి ఉంది..

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న తో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి సూపర్ ఫామ్ లో ఉన్న ఈ హీరో ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోల్లో టాప్ లెవెల్లో కొనసాగుతున్నాడు. ఇక నాని తన తదుపరి సినిమాలపై కూడా ఫుల్లుగా ఫోకస్ పెట్టగా, అదిరిపోయే కాంబినేషన్లు సెట్ చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మళ్ళీ ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. నాని స్టయిల్లో ఒక స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు లో రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే కొన్ని రోజుల కిందట టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో కూడా నాని 32వ సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మాణంలో ఆల్రెడీ సరిపోదా శనివారం చేస్తున్న నాని అదే బ్యానర్ లో సుజీత్ తో నాని సినిమా చేస్తున్నాడు.

సుజీత్ నాని కాంబో..

ఇక స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన సుజీత్ ఓ క్రేజీ కథతో చేయబోయే ఈ మూవీ కాన్సెప్ట్‌ ను వీడియో ద్వారా మేకర్స్ రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక అహింసా మార్గంలో సాగే ఒక హింసాత్మక వ్యక్తి కథ ఈ సినిమా అని మేకర్స్ వీడియో లో చెప్పడం జరిగింది. అయితే ఇక ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు మేకర్స్ అప్పుడు ప్రకటించారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సుజీత్ నాని కాంబోలో రాబోయే సినిమాను ఈ ఇయర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట .

- Advertisement -

ఇదే యేడాది రావాలంటే.. ఆయన నిర్ణయంతోనే..

అయితే నాని తాను చేస్తున్న సినిమాల ప్రాజెక్టులన్నీ గ్యాప్ లేకుండా షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నాడు. సరిపోదా శనివారం ఆగష్టు లో రిలీజ్ కి సిద్ధమవుతుండగా, సుజీత్ డైరెక్షన్లో చేసే యాక్షన్ థ్రిల్లర్ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక వచ్చే ఏడాది బలగం వేణు డైరెక్షన్లో ఎల్లమ్మ సినిమా చేయబోతున్నాడట. అయితే ఈ ఇయర్ డిసెంబర్ లోనే సుజీత్ సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. కానీ సుజీత్ పవన్ కళ్యాణ్ ఓజి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పవన్ లేకపోయినా మిగతా టెక్నికల్ వర్క్ ని పూర్తిచేయిస్తున్నాడు. అయితే సుజీత్ తో నాని సినిమా తెరకెక్కాలంటే పవన్ కళ్యాణ్ ఓజి పూర్తయ్యాకే కుదురుతుంది. అది కూడా పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ పూర్తయ్యాకే ఓజి షూట్ లో పాల్గొంటాడని క్లియర్ గా తెలుస్తుంది.

అలా కాకపోయినా, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఉస్తాద్, లేదా క్రిష్ హరిహర వీరమల్లు పై దృష్టి పెట్టినా ఓజి సినిమా కి గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ లో నాని సినిమాని కంప్లీట్ చేయొచ్చు. కానీ అది పవన్ కళ్యాణ్ పైనే డిపెండ్ అయి ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఎలక్షన్స్ అయిన తర్వాత మాత్రం పవన్ ఓజి పైనే ఫోకస్ పెడితే నాని సుజీత్ సినిమాకి చాలా గ్యాప్ వస్తుంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు