Ustaad bhagat Singh : ఆ సాలిడ్ పంచ్ అతనికే.. గుర్తుందిగా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలక్షన్ల వల్ల రాజకీయ ప్రచారంలో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. అయితే ఎలక్షన్లకు ముందు పవన్ కళ్యాణ్ అరడజను ప్రాజెక్టులకు సైన్ చేయగా, అందులో మూడు రిలీజ్ కాగా, మరో మూడు రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. ఆ సినిమాలే హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్. ఇక ఆ మూడు సినిమాలపై కూడా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక క్రిష్ తో చేస్తున్న వీరమల్లు నాలుగేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్నా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా కాబట్టి ఎక్కువ రోజులు పడుతుంది. ఇక సుజీత్ తో చేస్తున్న ఓజి సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోగా, ఈ సినిమా షూటింగ్ ఇంకా బాకీ ఉంది. ఇక ఫైనల్ గా ఫ్యాన్ బాయ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. గబ్బర్ సింగ్ తర్వాత ఈ కాంబో తెరమీదికి రావడంతో ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలున్నాయి.

టీజర్ తో సాలిడ్ ఇంపాక్ట్..

ఇంతకు ముందు ఉస్తాద్ గ్లిమ్ప్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా, తాజాగా మరో టీజర్ తో సెన్సేషనల్ హైప్ ని తీసుకొచ్చింది. తమిళ్ తేరి సినిమా స్క్రిప్ట్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చి తీస్తున్న ఈ సినిమా నుండి తాజాగా భగత్ బ్లెజ్ పేరుతో రిలీజ్ అయిన టీజర్ ఓ రేంజ్ లో అభిమానులని ఆకట్టుకుంటుంది. నిమిషం లోపు నిడివి ఉన్న ఈ వీడియో పవన్ ఫ్యాన్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంటూ సాలిడ్ కిక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అన్నిటిని మించి హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా సూపర్ గా ఉంది. అయితే ఈ సినిమాలో చూపించిన పవన్ పార్టీ రిఫరెన్స్ తో పాటు డైలాగ్స్ తో కొంతమందికి వేసిన సెటైర్లు కూడా బాగా పేలాయని చెప్పొచ్చు.

- Advertisement -

ఆ సాలిడ్ పంచ్ అతడికే..

అయితే తాజాగా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ బ్లెజ్ టీజర్ ని పవన్ కళ్యాణ్ రాజకీయాల నేపథ్యంలో సాలిడ్ డైలాగ్స్ తో రెడీ చేయగా, అభిమానుల్లో జోష్ నింపడానికే ఈ టీజర్ వచ్చిందని తెలుస్తుంది. అలాగే
పవన్ పార్టీ సింబల్ అయిన చై గాజు గ్లాసుని, అలాగే పవన్ రెగ్యులర్ గా వాడే తుండు ని కూడా రిఫరెన్స్ గా వాడడం జరిగింది. అయితే ఈ టీజర్ లో చెప్పిన డైలాగ్స్ మాత్రం ఆ సినీ, రాజకీయ వ్యక్తిని ఉద్దేశించే అన్నవని ఫ్యాన్స్ తో పాటు కొందరు నెటిజన్లు భావిస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. అప్పట్లో వైఎస్సార్ పార్టీకి అనుగుణంగా ఆర్జీవీ పలువురు రాజకీయనేతలతో సహా పవన్ ని కూడా తన సినిమాలతో గెలికాడన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో పవన్ ని ఆర్జీవీ తాను దర్శకత్వం వహించిన ఒక సినిమాలో ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టైం సీఎం అవుతాడని, నా సపోర్ట్ మీకేనని ఒక రకంగా సెటైరికల్ ట్రోలింగ్ వేస్తూ, జనసేన గుర్తు అయిన గాజు గ్లాసుని పగలగొడతాడు. అప్పట్లో పవన్ ఫ్యాన్స్ ని ఆ షార్ట్ ఫిల్మ్ బాగా హర్ట్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ చేసిన ఉస్తాద్ టీజర్ లో ఆర్జీవీ కి సాలిడ్ పంచ్ వేశారని, ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదెలాగంటే తాజాగా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ టీజర్ లో ఒక గాజు గ్లాస్ ను కిందపడేసి నీ రేంజ్ ఇది అని విలన్ చెప్పినప్పుడు, గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది అని చెప్పుకొచ్చాడు. అలాగే గ్లాస్ అంటే సైజు కాదు, కనిపించని సైన్యం అని, తన జనసేన అభిమానుల్ని ప్రస్తావిస్తూ ఆర్జీవీకి ఫ్యాన్స్ చూస్తూనే ఉన్నారు అని వార్నింగ్ కూడా ఇచ్చినట్లయింది. ఇక ఈ వీడియో తో రామ్ గోపాల్ వర్మని ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అలాగే చాలామంది రాజకీయంగా ప్రత్యక్షంగా విమర్శలు చేసే వ్యక్తులకి ఈ డైలాగ్స్ తో సమాధానంగా హరీష్ పంచ్ లు రాశాడు అని చెప్పొచ్చు. మరి ఈ టీజర్ పై రామ్ గోపాల్ వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు