Om Bheem Bush : విచిత్రంగా టాలీవుడ్ సెన్సార్ బోర్డు..

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో టాలీవుడ్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుందని తెలిసిందే. టాలీవుడ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతుంటాయని ప్రేక్షకులు భావిస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు సౌత్ లో ఎక్కువగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే తెలుగులో కొన్ని విలువలున్న సినిమాలు వస్తాయని, ఇండియన్ ట్రెడిషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ, వెస్ట్రన్ వల్గారిటీ కి కాస్త దూరంగా ఉంటాయని ఆడియన్స్ నమ్మకం. ఎప్పుడో ఏడాదిలో బేబీ లాంటి రెండు మూడు సినిమాలు తప్ప అన్ని సినిమాలు ఫ్యామిలీస్ చూసే విధంగానే తీస్తారు మన దర్శకులు. అయితే ఈ మధ్య టాలీవుడ్ సెన్సార్ బోర్డు పనితనం మాత్రం విచిత్రంగా ఉందని అనిపిస్తుంది. ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా, చెప్పాలంటే ఊహించని విధంగా సెన్సార్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. కొన్ని సినిమాలకి ఏ లాజిక్ తో అలా ఇస్తున్నారో కూడా తెలీడం లేదు.

ఈ సినిమాలకి ఏ సర్టిఫికెట్..

రీసెంట్ గా రెండు వారాల కింద రిలీజ్ అయిన గోపీచంద్ భీమా, విశ్వక్ సేన్ గామి చిత్రాలకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. భీమా లో వైలెన్స్ ఎక్కువగా ఉందని సెన్సార్ వాళ్ళు అలా ఇచ్చారట. కానీ భీమా లో మరీ అంత క్రూరంగా ఏమి వైలెన్స్ లేదు. ఇంతకంటే దారుణంగా చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో ఉంటాయి. ఆ మధ్య ప్రభాస్ సలార్ సినిమాకి కూడా ఏ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తమ పిల్లలతో సినిమా చూసేందుకు సలార్ థియేటర్ల మేనేజ్మెంట్లతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు తెలిసే ఉంటుంది. ఇక విశ్వక్ సేన్ గామి కూడా చిన్న మైథాలాజి టచ్ తో ఫాంటసీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఏ ఉద్ద్యేశంతో ఇచ్చారో తెలీదు. దాదాపుగా ఈ సినిమాలో కూడా వైలెన్స్ ఎక్కువగా ఉందనే అలా ఇచ్చారని అన్నారు. కానీ గామి లో అంత భయంకరంగా ఏమి లేవు. ఎంచక్కా పిల్లలతో సినిమా చూసేయొచ్చు. సింహం తో ఫైట్ సీన్స్ కూడా రిచ్ గా బాగున్నాయి. మరి సెన్సార్ బోర్డు ఉద్దేశం ఏంటో. ఇక లేటెస్ట్ గా ఒక కామెడీ డ్రామాకి మాత్రం వెరైటీగా యూఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

- Advertisement -

ఓం భీం బుష్..

లేటెస్ట్ గా శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఓం భీం బుష్ సినిమాకి సెన్సార్ బోర్డు సభ్యులు యూఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఒక కామెడీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ ఇవ్వడం సబబే. అయితే ఈ సినిమా టీజర్ లో, ట్రైలర్ కానీ చూస్తుంటే సినిమాలో వాడుక లో ఉన్న కొన్ని బూతు పదాలని వాడడం జరిగింది. అవి సినిమాలో చాలా చోట్ల ఉంటాయని సమాచారం. ఆ సన్నివేశాల్లో మ్యూట్ చేయకుండా సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి. మరి ఎంత మంచి సినిమా అయినా బూతు పదాలున్న సినిమాకి యుఎ ఇవ్వడమేంటో, యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్న సినిమాలకి ఏ సర్టిఫికెట్ ఇవ్వడమేంటో అని నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు