Tamannah : మిల్కీ బ్యూటీ.. బ్లాక్ బ్యూటీ గా

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఆల్మోస్ట్ నెంబర్ వన్ అనే రేంజ్ లో చెరగని ముద్ర వేసింది. ఈ భామ అంతే కాదు టాలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ హీరోయిన్ గా నటించిన అతి తక్కువ మంది హీరోయిన్ల లో ఈమె కూడా ఒకరు. మీడియం రేంజ్ హీరోలతో కూడా మొన్నటివరకూ సినిమాలు చేసింది. అయితే బాలీవుడ్ సినిమాలపై మోజుతో కొన్నాళ్ళు సౌత్ ని పక్కన బెట్టేసింది. అయితే అక్కడ పరాజయాలు వెంటాడడంతో తిరిగి సౌత్ బాట పట్టింది. లాస్ట్ ఇయర్ తెలుగులో భోళా శంకర్ లో నటించగా, తమిళ్ లో జైలర్ లో నటించింది. అయితే భోళా డిజాస్టర్ కాగా, జైలర్ హిట్టయినా తమన్నా కి ఏ క్రెడిట్టు దక్కలేదు. ఫలితంగా సౌత్ లో పెద్దగా ఛాన్సులు రావడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దాదాపుగా కష్టమనే చెప్పాలి. మహా అయితే సీనియర్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావొచ్చు.

ఓదెల 2 తో లక్..

టాలీవుడ్ లో ఇక సినిమాలు కష్టం అనుకుంటున్న దశలో సంపత్ నంది క్రేజీ ప్రాజెక్ట్ అయిన ఓదెల 2 లో ఛాన్స్ దక్కించుకుంది తమన్నా. తమన్నాయే మెయిన్ లీడ్ గా తెరకెక్కబోయే సినిమా కాబట్టి క్రెడిట్ మొత్తం తమన్నాకే వస్తుంది. ఇక దర్శకుడు సంపత్ నంది చాలా ఏళ్లుగా తమన్నాకి క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఈ అవకాశం ఈజీ గా వచ్చింది. అలాగే తాను గతంలో తీసిన చాలా సినిమాల్లో తమన్నాయే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తమన్నా అఘోర గెటప్ లో కనిపించనుంది. అలాగే తమన్నా హిందీలో రెండు సినిమాలు, తమిళ్ లో అరణ్మలై 4 లో కూడా కథానాయిక గా నటిస్తుంది.

- Advertisement -

వన్నె తరగని అందంతో..

ఇక తమన్నా సినిమాలు తగ్గించినా సోషల్ మీడియా లో ఎంత యాక్టీవ్ గా ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు సందడి చేస్తూ, ఫోటోషూట్ల తో కిర్రెక్కిస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో మిల్కి బ్యూటి అప్లోడ్ చేసిన స్టిల్స్ ఓ రేంజ్ లో అట్రాక్ట్ చేస్తున్నాయి. మిల్కి బ్యూటీ బ్లాక్ బ్యూటీ లా మారింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తమన్నా కొన్నేళ్ల ఫిట్ నెస్ కోల్పోవడంతో ఫేస్ గ్లో తగ్గినట్టనిపించింది. కాని తాజా స్టిల్స్ తో మళ్ళీ తమన్నా తనలో ఏమాత్రం అందం తరగలేదని నిరూపించుకుంటుంది. మరి తమన్నా తన తదుపరి సినిమాలతో ఆడియన్స్ ని ఎలా అలరిస్తుందో, తిరిగి మునుపటి స్టార్ డమ్ ని దక్కించుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతం అరణ్మలై4 షూటింగ్ లో ఉన్న తమన్నా, నెక్స్ట్ వీక్ ఓదెల 2 షూటింగ్ లో జాయిన్ అవుతుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు