Suhas : రిలీజ్ డేట్ కూడా ఫిక్స్.. యమ స్పీడ్ గా!

టాలీవుడ్ లో టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి అంటారు కొందరు. ఆ రెండూ ఉన్న సుహాస్ లక్కీ హీరో అని చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, చిన్న పాత్రలు వేస్తూ, ఆ తరువాత కలర్ ఫోటో సినిమాతో ఏకంగా హీరోగానూ సక్సెస్ అయ్యి తన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో సుహాస్. పదేళ్ల కిందటే షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు రావడానికి టైం పట్టింది. లాక్ డౌన్ సమయంలో ఓటిటి లో కలర్ ఫోటో సినిమాతో మంచి హిట్ట్టు కొట్టిన సుహాస్, ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయాడు. గతేడాది రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో రీసెంట్ గా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో మరోసారి ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక రీసెంట్ గానే అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ విడుదలై మూవీ మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం ఓటీటీలో కూడా బ్యాండ్ మోగిస్తుంది.

ప్రసన్నవదనం..

ఇక సుహాస్ హీరోగా గత నెలలో అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ తో హిట్టు కొట్టి ఊపుమీదున్నాడు. వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. తాజాగా సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ప్రసన్న వదనం”. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా ఆకట్టుకుని ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఆ టీజర్ లో ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లెమ్ తో హీరో బాధపడుతున్నట్లు చూపించారు. టీజర్ లో ప్రతీ సీన్ కూడా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసిన మేకర్స్ స్టోరీ లైన్ ఎక్కడా రివీల్ అవ్వకుండా మేకర్స్ టీజర్ ను కట్ చేశారు. నార్మల్ గా సుహాస్ చిత్రాల్లో కంటెంట్ రిచ్ గా ఉంటుంది. ప్రసన్న వదనం టీజర్ చూశాక అది మరోసారి రుజువయింది.

- Advertisement -

ఇక ఇప్పుడు రాబోయే ప్రసన్నవదనం సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్ కు ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ ను ఆసక్తికరంగా జోడించారు మేకర్స్. ఇక ఈ సినిమాకి ప్రసన్నవదనం అనే టైటిల్ ఎందుకు పెట్టారో టీజర్ చూశాక కొంత క్లారిటీ వచ్చింది. ఇక ఈ సినిమాతో సుహాస్ పాత్రను మేకర్స్ డిజైన్ చేసిన తీరు చాలా యూనిక్ గా ఉంది. ఎప్పటిలానే తన పెర్ఫార్మెన్స్ తో సుహాస్ అదరగొట్టేశారడు. సినిమాలో ఎంత క్లోజ్ గా ఉన్న వాళ్ళని అయినా గుర్తుపట్టకపోవడం. ఈ క్రమంలోనే హీరో తో తాను చేయని తప్పుకు బలైపోతూ ఉండగా, ఆ సమస్య కి పరిష్కారం కనుక్కున్నాడా లేదా? అనేది స్టోరీ నేపథ్యం.

అప్పుడే రిలీజ్ డేట్ ఫిక్స్..

ఇక సుహాస్ ప్రసన్న వదనం సినిమా రిలీజ్ డేట్ కూడా అప్పుడే ఫిక్స్ అయింది. రెండు వారాల కిందే టీజర్ రిలీజ్ చేయగా, ఇప్పుడు రిలీజ్ డేట్ అప్డేట్ తో టచ్ లోకి వచ్చారు. ప్రసన్నవదనం సినిమాని మే 3న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు. సమ్మర్ లో రావాల్సిన కల్కి వంటి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో ఈ సినిమా ఆ డేట్ ని ఫిక్స్ అయిందని చెప్పొచ్చు. త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేసి మరింత బజ్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్. ఇక సుహాస్ హీరోగా నటించబోయే ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్జున్ వైకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రసన్నవదనం తో సుహాస్ మరో సాలిడ్ హిట్టు కొట్టడానికి రెడీ అయ్యాడని తెలుస్తుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు