Bhimaa : గోపీచంద్ మాస్ పవర్.. డిజాస్టర్ నుండి యావరేజ్ దిశగా..

మాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన ‘భీమా’ సినిమా ఎన్నో భారీ అంచనాలతో మార్చి 8న థియేటర్ల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మాత్రం మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. కానీ గోపీచంద్ గత చిత్రాల కంటే బెటర్ గా ఉండడంతో, పైగా మాస్ ఎలిమెంట్స్ బాగుండడంతో బి,సి సెంటర్ల ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తున్నారు. ఇక భీమా రిలీజ్ అయ్యాక వాటి ఓపెనింగ్స్ మాత్రం ఆశాజనకంగా రాలేదు. దానికి గోపీచంద్ గత సినిమాల ప్రభావం ఒక కారణం అయితే, దీనికి పోటీగా కూడా గామి, ప్రేమలు రిలీజ్ అవడం వాటికి భీమా కంటే మంచి టాక్ రావడం వల్ల గోపీచంద్ సినిమాకి దెబ్బ పడింది. అయితే ఉన్నంతలో భీమా మాస్ ఏరియాలలో లాంగ్ రన్ లో సాలిడ్ వసూళ్లు సాధిస్తుంది.

రెండో వీకెండ్ లోనూ మాస్..

ఇక గోపీచంద్ భీమా సినిమా తో పాటు విశ్వక్ సేన్ నటించిన గామి, అలాగే డబ్బింగ్ సినిమా ప్రేమలు కూడా అదే రోజు రిలీజ్ అయినా, ఆ రెండూ డిఫరెంట్ జోనర్ చిత్రాలు కావడం గమనార్హం. అయితే మాస్ ప్రేక్షకులకు భీమాయే ఫస్ట్ ఆప్షన్ గా నిలిచింది. ఇక టాలీవుడ్ హీరోలలో మాస్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరోల్లో ఒకరైన గోపీచంద్ హిట్ కొట్టి ఆల్ మోస్ట్ పదేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ మాస్ ఏరియాల్లో గోపీచంద్ మూవీస్ కి మంచి ఓపెనింగ్స్ సొంతం అవుతాయి. భీమా కి హిట్ టాక్ కనుక సొంతం అయ్యి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా భారీ కం బ్యాక్ హిట్టు పడేది. ఇక భీమా ఫస్ట్ వీక్ లో 6.21 కోట్లకి పైగా షేర్ వసూలు చేయగా, తాజాగా రెండో వీకెండ్ లోకి ఎంటర్ అయింది. అయితే రెండో వీకెండ్ లో గామి చల్లబడగా భీమా మాత్రం డీసెంట్ హోల్డ్ కనబరిచింది. తాజాగా రెండో వీకెండ్ కూడా పూర్తి అవగా, భీమా పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా 7.91 కోట్ల షేర్ ని 14.39 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

- Advertisement -

డిజాస్టర్ నుండి యావరేజ్ దిశగా..

అయితే గోపీచంద్ భీమా రిలీజ్ అయ్యాక వచ్చిన టాక్ కు జరిగిన బిజినెస్ కు చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. పైగా వేరే సినిమాల పోటీ వల్ల భీమా ప్లాప్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ మాస్ ఏరియాల్లో డీసెంట్ హోల్డ్ ని చూపిస్తూ, వర్కింగ్ డేస్ లో కూడా బెటర్ కలెక్షన్లు రాబట్టింది. ఇక భీమా పది రోజుల్లో దాదాపు 66% బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోగా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 4.09 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాలి. అది కుదరకపోయినా తక్కువ నష్టాలతో బయటపడతారని మాత్రం చెప్పొచ్చు. ఓవరాల్ గా భీమా ని ప్లాప్ అయ్యే దశ నుండి గోపీచంద్ మాస్ క్రేజ్ తో ఏకంగా యావరేజ్ దాకా లాక్కొచ్చాడని చెప్పాలి. మరి ఇప్పుడైనా గోపీచంద్ తన ఇమేజ్ కి తగ్గ సరైన స్క్రిప్ట్ తో వచ్చి కం బ్యాక్ హిట్టు కొడతాడేమో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు