Family Star: విజయ్ దేవరకొండకు గోల్డెన్ ఛాన్స్… కావాల్సిందల్లా అదొక్కటే

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. కానీ రీసెంట్ టైమ్స్ లో ఆయన నటించిన సినిమాలు అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీ లైగర్, ఖుషి సినిమాలు డిజాస్టర్ గా నిలిచి, రౌడీ హీరో ఫ్యాన్స్ ను నిరాశపరిచాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” మూవీపైనే అందరి కళ్ళు ఉన్నాయి. ఈ మూవీ రిలీజ్ విషయంలో విజయ్ దేవరకొండకు గోల్డెన్ ఛాన్స్ దక్కింది. కానీ “ఫ్యామిలీ స్టార్”కు ఈ అద్భుతమైన అవకాశానికి మరొకటి కూడా తోడైతే ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం. ఇంతకీ అదేంటి అనే వివరాల్లోకి వెళితే…

ఇదే ఆ గోల్డెన్ ఛాన్స్…
విజయ్ దేవరకొండ హీరోగా, పరుశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్. మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుండగా, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తన కుటుంబానికి అండగా నిలిచే మధ్యతరగతి యువకుడి కథగా ఫ్యామిలీ స్టార్ తెరకెక్కుతోంది. గోపి సుందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ విషయంలో విజయ్ దేవరకొండకు మంచి గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఈ మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. ఫలితంగా హైప్ భారీగా పెరిగిపోయింది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే… ఏప్రిల్ నెలలో రిలీజ్ కు ఫ్యామిలీ స్టార్ తప్ప పెద్దగా ఇంట్రెస్టింగ్ సినిమాలు లేవు. అలాగే ఫ్యామిలీ స్టార్ కు ఉగాది, ఈద్ వంటి పండగలు కూడా కలిసి రాబోతున్నాయి. సమ్మర్ హాలిడేస్ కూడా దీనికి తోడు కానున్నాయి.

కావాల్సిందల్లా ఇదొక్కటే…
అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి ఈ పండగలు, సమ్మర్ సీజన్ మాత్రమే కాకుండా మరొకటి కూడా కావాలి. అదే పాజిటివ్ టాక్. మూవీకి పాజిటివ్ టాక్ వస్తే పైన చెప్పుకున్న అంశాలన్నీ కలిసి వచ్చి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం పక్కా. ఇక ఈ మూవీ దిల్ రాజు చేతిలో ఉంది కాబట్టి ఆయన గ్రాండ్ గా, వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తారు. పాజిటివ్ టాక్ గనక వచ్చిందంటే ఫ్యామిలీ స్టార్ ను ఈసారి హిట్ అందుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. వచ్చేవారం నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి.

- Advertisement -

వెంటాడుతున్న ట్రోల్స్…
ఫ్యామిలీ స్టార్ మూవీని ట్రోల్స్ వెంటాడుతూనే ఉన్నాయి. పోస్టర్ మొదలుకొని టీజర్ దాకా ఏ ఒక్క ప్రమోషనల్ కంటెంట్ ను వదలట్లేదు ట్రోలర్స్. టీజర్లో ఐరనే వంచాలా ఏంటి? నీ డైలాగ్, పోస్టర్లో విజయ్ దేవరకొండ వేసుకున్న కాస్ట్లీ చెప్పులు, రీసెంట్ అభినయ ప్లేట్లో విజయ్ దేవరకొండ దోస బదులు పేపర్ వేశాడు అంటూ ప్రతిసారి ఏదో ఒక రకంగా విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. ఫ్యామిలీ స్టార్ వీటన్నింటినీ పబ్లిసిటీగా మార్చుకొని, థియేటర్లలో విమర్శకులకు సమాధానం చెప్తాడా? విజయ్ దేవరకొండ ఈ గోల్డెన్ ఛాన్స్ ను ఎంతవరకు ఉపయోగించుకుంటాడు? ఇప్పటిదాకా మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ట్రోలింగ్ కు గురైన నేపథ్యంలో పాజిటివ్ టాక్ సాధ్యమేనా? అంటే ఏప్రిల్ 5 వరకు వెయిట్ అండ్ సి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు