Family Star : “ఫ్యామిలీ స్టార్” బడ్జెట్ పై దిల్ రాజు అసంతృప్తి

గత కొంతకాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం “ఫ్యామిలీ స్టార్” అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి అనుకున్న దాని కంటే బడ్జెట్ మరింత ఎక్కువైందట. హీరో, డైరెక్టర్ పారితోషికం తీసుకోకపోయినప్పటికీ బడ్జెట్ లిమిట్స్ దాటిందని ప్రచారం జరుగుతుంది. అయితే బడ్జెట్ విషయంలో దిల్ రాజు అసంతృప్తితో ఉన్నట్టు టాక్ నడుస్తోంది.

బడ్జెట్ ఎంత పెరిగింది?
“ఫ్యామిలీ స్టార్” మూవీకి గీత గోవిందం కాంబో రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. మరోసారి హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురాం కాంబోలో “ఫ్యామిలీ స్టార్” రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్ నిన్నటిదాకా జరిగింది. దీంతో మూవీకి ముందుగా అనుకున్న షెడ్యూల్స్ కాకుండా ఎక్కువ రోజులు పని చేయాల్సి వచ్చింది. కొన్ని కీలక భాగాలను అమెరికాలో చిత్రీకరించారు. అలాగే ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడడం వంటి రీజన్స్ తో బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువైందట. ముందుగా ఫిక్స్ అయిన దానికంటే దాదాపు 20 కోట్లకు పైగా బడ్జెట్ పెరిగిపోయిందని ఫిలింనగర్ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. దీంతో దిల్ రాజు సినిమా బడ్జెట్ విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారట.

దిల్ రాజు టెన్షన్ ఇదేనా?
ఇక దిల్ రాజు బడ్జెట్ విషయంలో టెన్షన్ పడడానికి విజయ్ దేవరకొండనే కారణం అది తెలుస్తోంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటించిన లైగర్, ఖుషి వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. ఇక ఫ్యామిలీ స్టార్ కు ఇంకా ఓటీటీ బిజినెస్ జరగనే లేదు. మరోవైపు దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ మూవీ బడ్జెట్ కూడా లిమిట్స్ దాటిపోయింది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని దిల్ రాజు టెన్షన్ పడుతున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ బిజినెస్ విషయంలో ఆయన ఒత్తిడిలో ఉన్నట్టు వినికిడి.

- Advertisement -

“ఫ్యామిలీ స్టార్” కలిసొచ్చే అంశం…
అయితే కొంతమంది సినీ విశ్లేషకులు మాత్రం దిల్ రాజు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి. ఇక ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న థియేటర్లోకి రానున్నాడు. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ కు పోటీగా విడుదలయ్యే సినిమాలు ఏమీ లేవు. అంటే సోలో రిలీజ్ అన్నమాట. అది కాకుండా హోలీ, ఉగాది వంటి హాలిడేస్ కూడా కలిసి రానున్నాయి. ఈ మూవీకి సమ్మర్ హాలిడేస్ కూడా మరొక ప్లస్ పాయింట్ కానున్నాయి. ఈ ఏడాది సమ్మర్ సీజన్లో భారీ స్థాయి సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చి ఫ్యామిలీ స్టార్ మూవీ మంచి సక్సెస్ అయితే, పెరిగిన బడ్జెట్ టీంకి పెద్దగా ఇబ్బందిగా మారకపోవచ్చు. కాగా డైరెక్టర్ పరుశురాం, విజయ్ దేవరకొండ ఈ మూవీకి పారితోషకం తీసుకోకుండా లాభాలు షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అంటే వీళ్లకు సినిమాపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. మరి దిల్ రాజు టెన్షన్ ను ఫ్యామిలీ స్టార్ మంచి కలెక్షన్స్ కాబట్టి తగ్గిస్తాడా? అనేది చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు