Personality Development : డిఫికల్ట్ పీపుల్ ను ఎలా మ్యానేజ్ చేయాలంటే?

ఆఫీసులో పని చేస్తున్నప్పుడు పలు రకాల వ్యక్తులు తగులుతారు. కొంతమంది మీతో బాగుంటే, మరి కొంతమందికి మాత్రం మీరు అస్సలు నచ్చకపోవచ్చు. ఆఫీస్ లో జరిగే రాజకీయాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే వాటి నుంచి దూరంగా ఉండడం లేదా పట్టించుకోకుండా ఉండడం దానికి పరిష్కారం కాదు. ఆఫీస్ లో డిఫికల్ట్ గా వ్యవహరించే వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం ముఖ్యం. అసలు వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అనేది తెలిసినప్పుడే వాళ్లను ఎలా మేనేజ్ చేయాలో అర్థం చేసుకోగలుగుతారు.

1. తమను తాము బాధితులుగా చిత్రీకరించుకోవడం….
మీరు వాళ్లకేదైనా పని చెప్పడానికి ట్రై చేస్తే ఎమోషనల్ అయిపోతారు. ఇంకా తను చేసిన పనికి అనేక సాకులు చూపిస్తూ క్షమాపణలు చెప్తారు. ఇలాంటివారు సాధారణంగా బాల్యం నుండి అభద్రత భావానికి గురికావడం వంటివి జరిగి ఉండొచ్చు. లేదా మానసిక అనారోగ్యంతో బాధపడుతుండొచ్చు. అందుకే ఆఫీసులో జరిగే కొన్ని సిచువేషన్ లో తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుంటారు.

2. ఇంకొంతమంది ఆఫీసులో అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. 

- Advertisement -

వారి వల్ల ఇతరుల జీవితాల్లో కలిగే అసౌకర్యాన్ని పక్కన పెట్టేసి, ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలా గొడవలకు కేంద్ర బిందువుగా మారడమే కాకుండా ఎవరైనా సరే తమకు సపోర్ట్ గానే నిలవాలని కోరుకుంటారు. అలా జరగలేదంటే తమను వ్యతిరేకించిన వారిపై రూమర్స్, గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు.

3. ఇక ఆఫీసులో మనం కలిసే వ్యక్తులు వివిధ రకాల మనస్తత్వాలను కలిగి ఉంటారు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే…

1. నార్సిసిస్ట్ :

వీళ్ళు తమకు సంబంధంలేని అంశాలు, సమస్యల్లోకి తమంతట తాముగా కలగజేసుకుంటారు. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవాలని అనుకుంటారు.

2. కంట్రోలింగ్ :

కొంతమంది అందరిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని భావిస్తారు. అలాంటివారు టీం హెడ్ గా లేదా ప్రాజెక్ట్ లో ఉంటే వాళ్లతో కలిసి పని చేయడం కష్టతరం అవుతుంది.

3. టూ సీరియస్ :

ఇలాంటి వాళ్లు అంచనాలకు మించి సీరియస్ గా ఉంటారు. వీళ్ళతో కనీసం జోక్ చేయడం కూడా అసాధ్యమే.

4. టూ ఎమోషనల్ :

వీళ్ళు ఎక్కువ కోపంగా లేదా విచారంగా ఉంటారు. లేదంటే కొన్నిసార్లు ఓవర్ డ్రామా చేస్తూ ఉంటారు. వాళ్లకు గొప్ప ఉద్దేశాలు ఉన్నప్పటికీ చేసే పనిలో ఎక్కువగా అహంకారాన్ని చూపిస్తారు. తమకు ఎదురయ్యే ప్రతి ఎదురు దెబ్బను లేదా ఊహించని సంఘటనను ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా మార్చేస్తారు.

5. అవసరం అండ్ అసహ్యం :

ఇలాంటి వారికి బాధించే ఉద్దేశం లేకపోయినప్పటికీ ఆ వ్యక్తులు ఒంటరిగా పనిచేయడం కష్టం. ఎందుకంటే తాము చేసే ప్రతి పనిని తోటి వారు అంగీకరించాలని అనుకుంటారు. అందుకే ఇతరులపై ఎక్కువగా ఆధారపడి పని చేస్తుంటారు.

6. నాన్ కన్ఫెర్టేశనల్ :

వీళ్ళు గొడవలకు ఎక్కువగా కారణం అవుతూ, ఇతరులను కూడా ఇబ్బందులకు గురి చేస్తారు. బాధ్యతల నుంచి తప్పించుకుంటారు. కో ఎంప్లాయిస్ తో కనెక్ట్ అవ్వలేరు. పరిస్థితితో సంబంధం లేకుండా ఇతరులతో కలిసి పనిచేయడానికి నిరాకరిస్తారు.

7. ఇంట్రెస్ట్ డ్రివెన్ :

వీళ్ళు పర్సనాలిటీ పరంగా చెడ్డవారు కాదు. కానీ ఎవరిని నమ్మరు. ఎందుకంటే ప్రాజెక్టులో పాల్గొనడానికి వారికి పూర్తిగా ఆసక్తి అవసరం. స్వార్థపరులుగా ఉంటారు కాబట్టి ఆసక్తి కోల్పోగానే తమ ప్రయత్నాన్ని ఆపేస్తారు.

8. అరాచక వాది :

వీళ్ళు తరచుగా విసుగు చెందుతూ ఉంటారు. గొడవలు లేదంటే ఇతరుల వల్ల జరిగే డ్రామాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలాంటి వ్యక్తులను, డిఫరెంట్ మనస్తత్వం ఉన్న వారిని ఎలా మేనేజ్ చేయాలి అంటే అసలు వాళ్లను పట్టించుకోనవసరం లేదు. గాసిప్స్ కు దూరంగా ఉండండి. పనిలో బిజీ అయిపొండి. ఒకవేళ పరిస్థితి మితిమీరితే బాస్ కు కంప్లైంట్ చేయడానికి వెనకాడొద్దు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు