Relationship Tips: అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన ఘట్టం. ముఖ్యంగా భారతదేశంలో పెళ్లికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఒకప్పుడు పెళ్లి అనగానే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి చెయ్యాలి అనేవారు. అందుకే ఆ బాధ్యతను తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులు తీసుకునేవారు. కానీ ఇటీవల కాలంలో పెద్దలు కుదించిన పెళ్లి పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ జీవితాల్లో జరిగే అతి ముఖ్యమైన ఘట్టమైన పెళ్లి విషయంలో తమ ప్రమేయం లేకుండా కేవలం పేరెంట్స్ ఇష్టం మీద ఆధారపడి తమకు కాబోయే జీవిత భాగస్వామితో ఏడడుగులు నడవడం వాళ్లకు కష్టంగా అనిపిస్తోంది. అయితే అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల కొన్ని లాభాలు, అలాగే నష్టాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా లాభాలు…

1. ఇద్దరి అంగీకారమే ముఖ్యం…
పెద్దలు కుదిర్చిన పెళ్లి అనగానే వాళ్లకు నచ్చిన వాళ్ళని చూసి కట్టబెట్టడం కాదు. ప్రస్తుత తరం తల్లిదండ్రులు అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చితేనే, ఇద్దరి అంగీకారం మేరకు పెళ్లిని జరిపిస్తున్నారు.. అంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే నిర్ణయాన్ని మీ చేతుల్లోనే పెడుతున్నారు. కట్న కానుకలు తదితర విషయాలను మాత్రం పెద్దలు చూసుకుంటున్నారు.

2. మీ ఇష్టాలకే పెద్దపీట…
అరేంజ్ మ్యారేజ్ లో మీకు తగ్గ వ్యక్తిని జీవిత భాగస్వామిగా తీసుకురావడానికి పేరెంట్స్ చాలా కష్టపడతారు. ఏదైనా సంబంధం వచ్చింది అంటే మీ కుటుంబ పద్ధతులకు దగ్గరగా ఉన్నారా? మీరు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వగలరా లేరా అని సవాలక్ష తీర్లు ఆలోచిస్తారు. మీ కంఫర్ట్, ఇష్టానికి ప్రాధాన్యతను ఇచ్చి అన్ని విధాల ఓకే అనుకుంటేనే పెళ్లి వైపు అడుగులు వేస్తారు.

- Advertisement -

3. మీ కంఫర్ట్ ముఖ్యం…
కుటుంబ వ్యవహారాలు, కట్టుబాట్లు నేపథ్యాలు దగ్గరగా ఉండే భాగస్వామిని మీకు జోడీగా తీసుకురావడానికి తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత తమ కూతురు లేదా కొడుకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని ముందుగానే ఆలోచిస్తారు. ఒకవేళ తర్వాత ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని మీరే సెటిల్ చేసుకోగలుగుతారు.

4. అడ్జస్ట్మెంట్స్ ఈజీ…
పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే మరొక ముఖ్యమైన లాభం ఏమిటంటే… మీ పుట్టినిల్లు, మెట్టినిల్లు దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. అంటే ఆచారాలు, సాంప్రదాయాలు సేమ్. కాబట్టి మీరు మెట్టింటి వారితో ఈజీగా కలిసిపోతారు. మిమ్మల్ని మీరు పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే సర్దుకుపోవడం కూడా.

5. కుటుంబ విధానాన్ని బలపరుస్తుంది…
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల కలిసి ఉండడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఒకవేళ కొత్తజంట సపరేట్గా కొత్త కాపురం పెట్టినప్పటికీ తమ కుటుంబాలను కలవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే పెళ్లైన దంపతులు ఒకరినొకరు తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబీకులను కూడా పరిచయం చేసుకుంటారు. దీనివల్ల కుటుంబ విధానం అనేది మరింత బలపడుతుంది.

6. ఫ్యామిలీ సపోర్ట్…
అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల దంపతుల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడం, పిల్లలను చూసుకోవడం, ఆర్థికంగా ఆడుకోవడం, వివాహ జీవితం సంతోషంగా ప్రేమగా ఉండేలా చూసుకోవడం వంటి విషయాల్లో కుటుంబం సపోర్ట్ కచ్చితంగా ఉంటుంది.

అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల నష్టాల విషయానికి వస్తే….

1. పెళ్లి కాదు అగ్రిమెంట్…
సాధారణంగా అరేంజ్డ్ మ్యారేజ్ లో ఎమోషన్స్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండదు. ముందుగా కాబోయే భార్య భర్తలను కలవనివ్వరు. ఎందుకంటే ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత ప్రేమలో పడండి అని చెప్తూ ఉంటారు పెద్దలు. ఇక పెళ్లిలో ఇరు కుటుంబాల పెద్దలు గమనించేవి పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబ చరిత్ర, వ్యక్తిగత వివరాలు, జాబ్, ఏం చదువుకున్నారు, అభిరుచులు ఏంటి, చర్మం రంగు, ఎత్తు, కొన్ని సందర్భాల్లో మతం, కులం ఉంటాయి. ఇష్టం కంటే ఎక్కువగా వీటికి ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల ఇది ఒక ఒప్పందంలా అనిపించవచ్చు.

2. నమ్మకం లేకపోవడం
కొన్నిసార్లు కుటుంబ పద్ధతుల వల్ల దంపతులు నిశ్చితార్థం అయ్యాక కూడా ఒంటరిగా కలుసుకునే వీలు ఉండదు. దీనివల్ల పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో ప్రారంభంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండదు. కెరీర్ స్టార్టింగ్ లోనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. పెళ్లయ్యాక కొత్త లైఫ్ పార్టనర్ పై నమ్మకం పెంచుకోవడం కష్టం అవుతుంది. అదే భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుంది. చిన్న విషయాలకే గొడవలు ఎక్కువ అయ్యి విడాకుల వరకు వెళ్లాల్సి వస్తుంది.

3. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్…
పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కపుల్స్ మధ్య కలహాలు వస్తే ఆ ఎఫెక్ట్ ఫ్యామిలీ పై పడుతుంది. ముఖ్యంగా అత్తమామలు కొత్త దంపతుల వైవాహిక జీవితంలో జోక్యం చేసుకోవడం, లేదా మిమ్మల్ని ఎగతాళి చేయడం వంటివి చేస్తే కుటుంబ సమస్యలు పెరుగుతాయి.

4. అబ్బాయిలకే ప్రాధాన్యత….
పెద్దలు కుదిర్చిన పెళ్లిలో సాధారణంగా అబ్బాయిలకే ప్రాధాన్యత ఉండటం వల్ల అమ్మాయిని తక్కువ చేసి చూస్తారని భావన ఎంతో మందికి ఉంది. దీంతో వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తడం కామన్.

5. ఫ్యామిలీ బ్లాక్ మెయిల్…
అరేంజ్డ్ మ్యారేజ్ లో ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకోమని ఫ్యామిలీ ఒత్తిడి చేస్తుంది. ఒకవేళ నో చెప్పారంటే ఏదో ఒక రకంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నిర్ణయాన్ని మార్చుకునేలా చేస్తారు.

6. విడాకులు కష్టం…
అరేంజ్డ్ మ్యారేజ్ లో విడాకులు తీసుకోవడం కష్టమవుతుంది. అలా చేస్తే కుటుంబం అలా చేస్తే కుటుంబానికి అవమానం అని లేదంటే పరువు పోతుందని భయపడతారు. ఒకవేళ అన్ని కాదనుకుని విడాకులు తీసుకుంటే రెండు కుటుంబాలు మధ్య చాలా దూరం పెరిగిపోతుంది.

7. మ్యాచ్ పర్ఫెక్ట్ కాకపోతే…
ఇక అరేంజ్డ్ మ్యారేజ్ లో చెప్పుకోవాల్సిన అతి పెద్ద నష్టం ఒకవేళ ఎంచుకున్న వ్యక్తి పర్ఫెక్ట్ మ్యాచ్ కాకపోతే ఎదురయ్యే పరిణామాలు. కొన్నిసార్లు కుటుంబాలు తీసుకున్న నిర్ణయాలు తప్పవుతాయి. భార్యాభర్తలు ఇద్దరూ పర్ఫెక్ట్ మ్యాచ్ కాకపోతే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు