Vijay deverakonda: హీరో కాకపోయింటే విజయ్ దేవరకొండ ఏం చేసేవారో తెలుసా..?

రౌడీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించి తన నటనతో ఆకట్టుకుని… పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తారు.. ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో యువతలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.. ఇందులో సూపర్ స్టైలిష్ గా, మాస్ గా కనిపించి ప్రేక్షకులను కట్టిపడేశారు.. ముఖ్యంగా ఈయన మాట్లాడే విధానం, వ్యక్తిత్వంతో కోట్లల్లో అభిమానులు ఏర్పడ్డారని చెప్పాలి.. ఇక తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అన్నీ కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి.

సామ్ జామ్ టాక్..
ఇదిలా ఉండగా తాజాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ సమంత హోస్ట్ గా వ్యవహరించిన సామ్ జామ్ టాక్ షోలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.. ఒకవేళ తాను ఇండస్ట్రీలోకి రాకపోయి ఉండి ఉంటే ఏం చేసేవాడో కూడా వెల్లడించారు.. విజయ్ దేవరకొండ ఒకవేళ హీరో అవ్వకపోతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించిన ప్రొఫెషన్ లో ఉండేవాడిని అంటూ చెప్పుకొచ్చారు… ప్రస్తుతం విజయ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అంతేకాదు ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్ బెస్ట్ ఆప్షన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు..

విజయ్ దేవరకొండ సినిమాలు..
మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకొని నోటా , ఏ మంత్రం వేసావే, గీతగోవిందం, డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్, టాక్సీవాలా, అర్జున్ రెడ్డి , లైగర్ వంటి సినిమాలలో హీరోగా అవకాశం దక్కించుకొని స్టార్ హీరోల జాబితాలో చేరాడు.. అయితే పాన్ ఇండియా సినిమా లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది..

- Advertisement -

ఫ్యామిలీ స్టార్ విశేషాలు..
ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. పరుశురాం దర్శకత్వంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు ..ఒకవేళ ఈ రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటే విజయ్ దేవరకొండ కి పూర్వ వైభోగం వస్తుంది అనడంలో సందేహం లేదు..కానీ ఎప్పటిలాగే ఈ రెండు కథలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోతే ఈయన కెరియర్ చాలా డౌన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.. మరి ఈ రెండు సినిమాలతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి.. ఏది ఏమైనా రౌడీ హీరో మళ్లీ నిలదొక్కుకోవాలని అభిమానులైతే ఆశగా ఎదురుచూస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు