Samantha: ఆ హీరో పై మనసు పారేసుకుంటున్న సమంత.. అతడే నా క్రష్ అంటూ..!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి బయటపడే దశలో ఉంది.. తిరిగి రెట్టింపు ఎనర్జీతో అంతకుమించి ఉత్సాహంతో సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తోంది.. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడమే కాదు తన క్రష్ ఎవరో కూడా చెప్పేసింది..

స్టార్ హీరోలపై సమంత కామెంట్స్..
తాజాగా ఒక మీడియా చిట్ చాట్ లో యాంకర్ ముగ్గురు హీరోల గురించి చెప్పి ఒక మాటలో వారి గురించి చెప్పాలని తెలిపింది. అంతేకాదు ఎవరంటే క్రష్ అనే విషయం కూడా వెల్లడించాలని యాంకర్ అడిగింది.. దీనికి సమంత మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పేరు చెప్పగానే క్రష్ అని వెల్లడించింది.. బార్డరింగ్ క్రష్ అని చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రభాస్ , షారుఖ్ ఖాన్ ల గురించి కూడా యాంకర్ అడగగా ఊహించని కామెంట్స్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ప్రభాస్ , షారుక్ ఖాన్ లు అంటే తనకు రెస్పెక్ట్ అని.. షారుక్ పై తనకు ఎలాంటి క్రష్ లేదని కూడా వెల్లడించింది.. దీంతో సమంత చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

అల్లు అర్జున్ పై క్రష్..
తాజాగా అల్లు అర్జున్ తన క్రష్ అని చెప్పిన ఈ ముద్దుగుమ్మ గతంలో అల్లు అర్జున్ తో కలిసి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇక ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ కోసమే ఈమె స్పెషల్ సాంగ్ లో మెరిసిన విషయం తెలిసిందే.. ఊ అంటావా మావ అనే పాటలో సమంత, అల్లు అర్జున్ కలిసి వేసిన స్టెప్పులకి థియేటర్లు సైతం దద్దరిల్లాయి.. పైగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది.. సినిమాకే వీరి జంట హైలెట్గా నిలిచిందని చెప్పవచ్చు.. అంతేకాదు ఇప్పటికీ ఈ పాట ట్రెండింగ్ లోనే ఉందనడంలో సందేహం లేదు.

- Advertisement -

సమంత సినిమాలు..
సమంత చివరిగా ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఈ సినిమాతో పాటు వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది .. ఈ సమ్మర్ లోనే ఈ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధం కాబోతోంది.. ఈ వెబ్ సిరీస్ తర్వాత రెస్ట్ ప్రకటించిన ఈమె మళ్లీ ఎప్పుడు రియంట్రీ ఇస్తుందో తెలియాల్సి ఉంది.. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె ఏ మూవీ తో కం బ్యాక్ అవుతుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు