Samantha: నేను ఎప్పుడూ నా సమస్యను పబ్లిక్ గా చెప్పలేదు

గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోహిన్ గా పరిచయమైంది సమంత. ఏమాయ చేసావే సినిమాలో సమంత చేసిన జెస్సీ క్యారెక్టర్ ని ఏప్పటికి మరువలేము. ఆ సినిమాలో సమంత పర్ఫామెన్స్ కి కుర్ర కారంతా ఫిదా అయిపోయారని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత సమంత సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది సమంత.

అయితే సమంత తన కెరియర్లో చాలామంది స్టార్ హీరోలతో కూడా వర్క్ చేసిందని చెప్పొచ్చు. దాదాపుగా అందరు స్టార్ హీరోస్ సమంత వర్క్ చేసింది. సమంత కెరియర్లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. ఇక సమంతకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలంటే ఎన్టీఆర్ తో చేసిన బృందావనం. మహేష్ బాబుతో చేసిన దూకుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఈ సినిమా అప్పట్లో ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.

ఇకపోతే నితిన్ అల్లు అర్జున్ వంటి హీరోల సరసన కూడా నటించింది సమంత. నితిన్ సరసన ను నటించిన అఆ సినిమా సమంతకి మంచి పేరును తీసుకొచ్చింది. ఇకపోతే సమంత ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమా తర్వాత నాగచైతన్యతో ఆటోనగర్ సూర్య మనం వంటి సినిమాలలో కనిపించింది సమంత. ఆ తర్వాత నాగచైతన్యను పెళ్లి చేసుకుంది సమంత.

- Advertisement -

అది వీరిద్దరూ కొంతకాలం వరకు బానే ఉన్న కొన్ని వ్యక్తిగత కారణాల వలన వీరు విడిపోయారు. ఇకపోతే సమంత ప్రస్తుతం కొన్ని సినిమాలను చేస్తున్నారు. సమంత రీసెంట్ టైమ్స్ లో విపరీతమైన క్రేజీ ను సాధించింది అని చెప్పొచ్చు. బాష తో సంబంధం లేకుండా అన్ని భాషల్లో చిత్రాలు చేస్తూ తన సత్తా ఏంటో చూపిస్తుంది.

రీసెంట్ గా సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఓ బేబీ, యశోద, శాకుంతలం వంటి సినిమాలను తెలుగులో చేసింది సమంత. ఈ సినిమాల్లో శాకుంతలం మినహా మిగతా సినిమాలు మంచి హిట్ ను అందుకున్నాయి. ఇకపోతే రీసెంట్ గా సమంత ఒక వీడియోలో తను పడిన బాధను చెప్పుకొచ్చింది.

అయితే డివోర్స్ తర్వాత సమంతను వ్యక్తిగతంగా చాలా ట్రోల్స్ చేశారని, చాలా కథనాలు రాశారని, అయితే తను ఎప్పుడూ తనకున్న హెల్త్ ప్రాబ్లం గురించి ఎప్పుడూ పబ్లిక్ గా చెప్పలేదని చెప్పి సమంత చెప్పుకొచ్చింది. అయినా కూడా తనని సింపతి క్వీన్ అని చాలామంది కథనాలు రాశారని ఇంకొంతమంది ట్రోల్ చేశారని బాధపడుతూ చెప్పుకొచ్చింది సమంత.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు