Singer Mangli: సింగర్ మంగ్లీ కి ప్రమాదం.. అసలేం జరిగిందంటే..?

తెలంగాణ పాటలతో ప్రత్యేకించి బతుకమ్మ పాటలతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది సింగర్ మంగ్లీ.. ఆ తర్వాత ఎన్నో రకాల టీవీ షోలలో తనదైన స్టైల్ లో పాటలు , డాన్స్ లతో అందరిని ఆకట్టుకుంది.. సింగర్ మంగ్లీ ఎలాంటి పాటలో నైనా సరే ప్రేక్షకులను కట్టిపడేసేలా చేస్తూ ఉంటుంది.. సినిమాలలో కూడా తన ఫోక్ సాంగ్స్ తో , స్పెషల్ సాంగ్ లతో అలరించే ఈమె.. ఎక్కువగా శివుడి పాటలతో భక్తి పారవస్యంతో ముంచేత్తుతూ ఉంటుంది.. సింగర్ గా అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్న మంగ్లీ.. సినిమా రంగంలో బాగానే దూసుకుపోతోంది.

సింగర్ మంగ్లీ కి కార్ యాక్సిడెంట్..
ఇదంతా ఇలా ఉండగా తాజాగా సింగర్ మంగ్లీ ప్రయాణిస్తున్నటువంటి కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది.. ఇటీవలే ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం.. సింగర్ మంగ్లీ.. ఈ కారు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారని పోలీసులు సైతం తెలియజేశారు.. అసలు విషయంలోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం చాలా గ్రాండ్గా జరిగింది. ఈ ఉత్సవాలకు సింగర్ మంగ్లీ హాజరయ్యారు.

తృటిలో తప్పిన ప్రమాదం..
ఆ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో అర్ధరాత్రి కావడం చేత మేఘరాజ్ మనోహర్ తో కలిసి ఈమె తన కారులో ప్రయాణిస్తూ హైదరాబాద్ టు బెంగళూరు జాతీయ రహదారి మీదుగా తన ఇంటికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో శంషాబాద్ మండలం తోడుపల్లి వంతెన వద్దకి రాగానే కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి ఒక డీసీఎం వెనుక నుంచి వేగంగా వచ్చి ఈమె కారును ఢీ కొట్టిందట.. అయితే ప్రమాదమేమి జరగలేదని..ఈ ఘటనలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది.

- Advertisement -

మద్యం మత్తులో కార్ డ్రైవర్..
ఈ ప్రమాదం జరగడానికి ముఖ్య కారణం డీసీఎం డ్రైవర్ మద్యం మత్తు కారణమే అన్నట్లుగా పోలీసులు సైతం తెలియజేశారు.. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు చేయబోతున్నట్లు అక్కడ పోలీసులు తెలియజేశారు.. ఏది ఏమైనా సింగర్ మంగ్లీ ప్రమాదం నుంచి బయటపడడంతో అభిమానులు సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారు..

సింగర్ మంగ్లీ కెరియర్..
తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె రాయలసీమ ప్రాంతానికి చెందినవారు.. ఇక తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుని ఇప్పుడు పలు టీవీ చానల్స్ లో ప్రసారమవుతున్న సింగింగ్ కాంపిటీషన్ షోలకి జడ్జిగా వ్యవహరిస్తోంది. మంగ్లీ సింగర్ గా మాత్రమే కాదు డాన్సర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే ..ఇక ఈమె మాత్రమే కాదు ఈమె చెల్లెలు ఇంద్రావతి చౌహన్ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో సింగర్ గా కొనసాగుతోంది. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ఊ అంటావా మావ అనే పాటకి తన గాత్రం అందించి ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది ఇంద్రావతి చౌహాన్.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు