Mangli: ఫిదా సినిమాలో అలాంటి పాత్ర మిస్ చేసుకున్న మంగ్లీ..చేసింటేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా దూసుకుపోతున్న వారిలో సింగర్ మంగ్లీ కూడా ఒకరు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట న్యూస్ యాంకర్ గా తన కెరీయర్ని మొదలుపెట్టి తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో మరింత క్రేజ్ అందుకుంది. మంగ్లీ ఆ తర్వాత పలు సినిమాలలో పాటలు పాడి తన స్వరంతో ప్రత్యేకత చాటుకొని మరింత ఇమేజ్ అందుకుంది.. ముఖ్యంగా ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా ఈమెకు మరిన్ని అవకాశాలు తీసుకువచ్చేలా చేశాయి.

గాయనిగా వరుసగా అవకాశాలు అందుకుంటూ తిరుగులేని స్టార్ డం అందుకున్న సింగర్ మంగ్లీ.. ప్రస్తుతం పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే పలు సినిమాలలో పాటలు పాడుతూ సింగర్ గా తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుని మంగ్లీ అన్ని రకాల జోనర్ సాంగ్స్ పాడుతూ ఉంటుంది. ప్రైవేట్ ఆల్బమ్స్ లలో అన్నిటిలో కూడా తన పాటలకి తానే డాన్స్ వేసుకుంటూ వీడియో సాంగులు చేస్తూ ఉంటుంది. ఈ కారణంగానే ఈమె నటిగా కూడా పలు పాత్రలు వస్తూ ఉన్నాయి.

ఇలాంటి క్రేజ్ తో ఉన్న మంగ్లీ కి చాలామంది దర్శక నిర్మాతలు ఏదైనా సినిమాలలో తనను లీడ్ రోల్ లో నటించమని సంప్రదిస్తూ ఉన్నారట. ఆమె మాత్రం ఇలాంటి పాత్రలను చాలా సున్నితంగానే తిరస్కరిస్తున్నట్లు సమాచారం. అలా ఒక సూపర్ హిట్ సినిమాలో కూడా హీరోయిన్గా మంగ్లీ కి అవకాశం రాగా వదులుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. సాయి పల్లవి హీరోయిన్ గా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైన చిత్రం ఫిదా.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించారు.

- Advertisement -

ఈ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి కంటె ముందుగా శేఖర్ కమ్ముల సింగర్ మంగ్లీ ని హీరోయిన్ గా చేయమని అడిగారట. అయితే ఆమెకు హీరోయిన్ గా నటించడం ఇష్టం లేకపోవడంతో ఈ సినిమాని చేయనని తెలియజేసిందట. ఎంతోమంది హీరోయిన్లను ప్రయత్నించి.. ఫైనల్ గా సాయి పల్లవి ఈ సినిమాకి ఓకే చేయడంతో శేఖర్ కమ్ముల ఈమెకు అవకాశం ఇచ్చారు.

అలా సాయి పల్లవి ఇమేజ్ భారీగా పెరిగిపోవడంతో పాటు స్టార్ యాక్టర్ గా పేరు సంపాదించి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది.. ఈ విషయం తెలిసి మంగ్లీ అభిమానులు మంగ్లీ వదులుకున్న పాత్రను సాయి పల్లవి చేసి స్టార్ హీరోయిన్ అయ్యిందా అంటూ సోషల్ మీడియాలో జోరుగా ఈ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ మంగ్లీ ఆ పాత్రను చేసి ఉండి ఉంటే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోయేది అని అభిమానులు చెబుతున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు