Sandeep Reddy Vanga: ఈ యానిమల్‌తో మనకెందుకు… తెలుగు హీరోల ఫీల్ ఇదేనా?

ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి… ఎన్నో వివాదాస్పదల మధ్య వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సందీప్ రెడ్డి వంగా విషయం ఉన్న డైరెక్టర్ గా సినీ ప్రపంచం చూసేలా చేసింది. ఇదే సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్. దీంతో హిందీ ఇండస్ట్రీలో కూడా తిరుగులేకుండా అయిపోయింది సందీప్‌కి. ఇప్పుడు యానిమల్ మూవీ… పాన్ ఇండియా వైడ్ సంచలనాలను క్రియేట్ చేస్తుంది.

ఇప్పటికే 737 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ… 1000 కోట్లే టార్గెట్ గా వెళ్తుంది. అలాంటి డైరెక్టర్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తున్నాడు? దానిలో హీరో ఎవరు? అనేదానిపై ఇప్పుడు చాలా డౌట్స్ వస్తున్నాయి. సందీప్ లైనప్‌లో స్పిరిట్ తో ప్రభాస్ ఉన్నాడు. అలాగే అల్లు అర్జున్ తో కూడా ఓ మూవీ చేయాలి. కానీ, ఇవేవీ కూడా సందీప్ తర్వాత సినిమాలు కావు. ఈ విషయాన్ని స్వయంగా సందీపే చెప్పాడు. అయితే సందీప్ తర్వాత ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు? మళ్లీ హిందీ హీరోనేనా? లేదా తెలుగు హీరోతో ఛాన్స్ ఉంటుందా?

సందీప్ రెడ్డి తెలుగు డైరెక్టర్ కాబట్టి… ఇక్కడి హీరోలు సందీప్ ను ఒకే చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అందులోనూ అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు సందీప్ నుంచి వచ్చాయి. ఇది ఎక్స్ ట్రా.. క్వాలిఫికేషన్ అనుకోవచ్చు. అయినా సందీప్ రెడ్డి తర్వాత సినిమా గురించి ఇప్పటి వరకు ఎందుకు అప్డేట్ రాలేదు? సందీప్ దగ్గర కథలు లేవా? అంటే ఉన్నాయి. తన వద్ద కథలు రెడీ గా ఉన్నాయని, హీరోల కోసం వెయిటింగ్ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ చెప్పాడు. ప్రభాస్, బన్నీనే కాదు.. రామ్ చరణ్, మహేష్ తో కూడా తాను సినిమాలు చేస్తాననీ చెప్పాడు. కానీ, తర్వాత సినిమా గురించి మాత్రం అప్డేట్ లేదు.

- Advertisement -

అయితే… అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు చూసిన తర్వాత సందీప్ తో సినిమాలు చేయడానికి కొంత మంది హీరోలు భయపడుతున్నారట. సందీప్ చెప్పే కథలు నచ్చినా, ఈ యానిమల్‌తో మనకు ఎందుకు… మంచి సాఫ్ట్ స్టోరీలతోనే సినిమాలు చేద్దామని అనుకుంటున్నారట. అందుకే సందీప్ నుంచి రాబోయే తర్వాత ప్రాజెక్ట్ విషయంలో ఆలస్యం అవుతుందని టాక్.

తెలుగు హీరోలను కాదని, మరోసారి హిందీ హీరోలతో సినిమా చెయొచ్చు. కానీ, యానిమల్ సినిమాను తెలుగు హీరోలతో కాకుండా బాలీవుడ్ హీరోలతో చేసినందుకు ఇప్పటికే సందీప్ పై తెలుగు ఆడియన్స్ గుర్రుగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మళ్లీ హిందీ హీరోతో సందీప్ సినిమా చేసేంత సహసం చేయలేడు అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సందీప్ నుంచి వచ్చే సినిమాలో హీరో ఎవరైనా, అది యానిమల్ కంటే.. ఎక్కువ ఉంటుందని అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు