Japan OTT : తెలుగు వాళ్లంటే అంత చులకనా? నెట్ ఫ్లిక్స్ పై ఆడియెన్స్ ఫైర్

తమిళ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం జపాన్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అదే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది. జపాన్ మూవీ ని రిలీజ్ చేసిన పాపులర్ ఓటిటిపై తెలుగు ఆడియన్స్ ఫైర్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే…

తమిళ హీరో కార్తీ తెలుగులో కూడా ఫేమస్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన తమిళ స్టార్లలో ఆయన కూడా ఒకరు. అయితే ఇప్పుడు ఆయన లేటెస్ట్ సినిమా విషయంలో ఓటిటి దిగ్గజం చేసిన తప్పిదం తెలుగు ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. జపాన్ సినిమాని ప్రసారం చేస్తున్న నెట్ ఫ్లిక్స్ తెలుగు ప్రేక్షకులను నిరాశపరిచింది. జపాన్ మూవీ భారీ అంచనాలతో దీపావళి కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. కానీ నెగిటివ్ మౌత్ టాక్, రివ్యూల వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ ఘోరంగా పరాజయం పాలైంది. అయితే ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగా ఉండడంతో కార్తీ ఎనర్జీని బిగ్ స్క్రీన్ పై చూడడానికి ఆసక్తి చూపించిన ప్రేక్షకులంతా ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతుందా అని ఎదురు చూశారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న దిగజా ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ డిసెంబర్ 11 అర్ధరాత్రి నుంచి ఈ మూవీని అన్ని భాషల్లో ప్రసారం చేయనున్నట్టుగా ప్రకటించింది.

కానీ తీరా మూవీ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు షాక్ ఇస్తూ జపాన్ మూవీని కేవలం తమిళంలో మాత్రమే ప్రచారం చేసింది నెట్ ఫ్లెక్స్. దీంతో తెలుగు ఆడియన్స్ నెట్ ఫ్లిక్స్ పై మండిపడుతున్నారు. ముందుగా ఈ సినిమాను అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయబోతున్నామంటూ ప్రకటించి ఊరించారని, తీరా టైం రాగానే తెలుగు ప్రేక్షకులకు హ్యాండ్ ఇచ్చారని, తెలుగు ఆడియన్స్ అంటే నెట్ ఫ్లిక్స్ కు అంత చులకనగా కనిపిస్తున్నారా అంటూ ఫైర్ అవుతున్నారు. కాగా త్వరలోనే ఈ మూవీని ఇతర భాషల్లోనూ విడుదల చేయనున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

- Advertisement -

కాగా నవంబర్ 10 న థియేటర్లలో విడుదలైన తమిళ హీస్ట్ కామెడీ జపాన్ మూవీలో కార్తీక్ ప్రధాన పాత్ర పోషించాడు. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ పాత్ర పోషించింది. సునీల్, జితన్ రమేష్, విజయ్ మిల్టన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పోలీసులు బలవంతంగా పెట్టిన ఒక పెద్ద దొంగతనం కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే దొంగ కథ ఈ జపాన్ మూవీ. భారీ అంచనాలతో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. మరి ఓటిటిలో అయినా ఈ మూవీకి మంచి ఆదరణ లభిస్తుందా అనేది చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు