Japan: దీపావళి సినీ టపాసులన్నీ తుస్సుమన్నాయేంటి?

టాలీవుడ్ లో ఈ దీపావళి కి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అయితే ఆ సినిమాల్లో ఒక్క తెలుగు సినిమా తప్ప మిగతావన్నీ డబ్బింగ్ సినిమాలే. పొంగల్ రేసు పై ద్రుష్టి పెట్టి మంచి పండగ దినాల్ని తెలుగు హీరోలు మిస్ చేసుకోగా, దీన్ని క్యాష్ చేసుకుందామని చిన్నా పెద్దా డబ్బింగ్ హీరోలు రెడీ అయ్యారు. అయితే వాటిలో ఏ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందో అని గమనిస్తే ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఆడియన్స్ నుండి సరైన రెస్పాన్స్ తెచ్చుకోలేదని చెప్పాలి.

ముందుగా తెలుగు సినిమా నుండే స్టార్ట్ చేస్తే “అలా నిన్ను చేరి” అనే చిన్న సినిమా ఊరు పేరు లేని సినిమాలా సైలెంట్ గా రిలీజ్ అయ్యి సైలెంట్ గా దొబ్బేసింది. ఇక డబ్బింగ్ సినిమాల్లో మంచి కాన్సెప్ట్ గా పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని రిలీజ్ అయిన సినిమా “దీపావళి”. ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా ఓకే అనిపించుకున్నా, బోరింగ్ స్క్రీన్ ప్లే తో అంతగా ఆకట్టుకోలేదు.

ఇక ఈ దీపావళి కి మంచి బజ్ తో రిలీజ్ అయిన సినిమాల్లో కార్తీ “జపాన్”, తో పాటు, లారెన్స్, ఎస్.జె. సూర్య కలిసి నటించిన “జిగర్ తండా2” ఒకటి. జపాన్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కగా ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకుని, అంటించకుండానే దీపావళి టపాస్ ఫెయిల్ అయ్యిందనిపించుకుంది. ఇక జిగర్ తండా2 ఆడియన్స్ నుండి ప్లాప్ టాకే అందుకోగా, జిగర్ తండా లో సగం కూడా లేదని విమర్శకులు చెప్తున్నారు. ఈ రెండు సినిమాలు దీపావళి పాముల్లా బుస్సుమని పొంగి బూడిదయ్యాయి.

- Advertisement -

కనీసం బాలీవుడ్ డబ్బింగ్ సినిమా టైగర్ 3 ఏమైనా థియేటర్లకు రప్పిస్తుందా అంటే, పండగ రోజే బాలీవుడ్ జనాలకి డబ్బులు మిగులుద్దామని ప్రీమియర్స్ నుండే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్ గా ఈ దీపావళి కి వచ్చిన ఒక్క సినిమా టపాస్ కూడా పేలలేదనే చెప్పాలి. మరి రాబోయే దీపావళికి అయినా మంచి సినిమాలతో ఆడియన్స్ కి దీపావళి ఆనందాన్ని తెస్తాయో లేదో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు