Prasanna Kumar: ఓ బిజినెస్ మైండ్.. దర్శకుడిని కాకుండా ఆపింది?

బెజవాడ ప్రసన్నకుమార్ జబర్దస్త్ షో కి స్కిట్లు రాయడం దగ్గర కెరియర్ మొదలుపెట్టి నేడు సినిమాలకి కథల రాసే స్థాయి వరకు ఎదిగాడు. బెజవాడ ప్రసన్నకుమార్ రాసిన చాలా కథలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని తీసుకుని వచ్చాయి. ముఖ్యంగా బెజవాడ ప్రసన్నకుమార్ త్రినాధ్ రావు నక్కిన కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ప్రతి రచయిత కూడా దర్శకుడు అవ్వాలని ఉద్దేశంతో ఉంటారు. అలా రచయితగా కెరియర్ మొదలుపెట్టి నేడు స్టార్ డైరెక్టర్స్ గా ఎదిగిన దర్శకులు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు.

రచయితగా స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, వంటి సినిమాలకు పని చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారాడు. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అలానే బృందావనం, భద్ర వంటి సినిమాలకు కథలను అందించి రచయితగా పనిచేసిన కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడుగా మారారు. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ తో దేవర సినిమాను నిర్మిస్తున్నాడు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలనందించి రచయితగా పనిచేసిన వక్కంత వంశీ “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఈ జనరేషన్ లో వీళ్ళ గురించి మాట్లాడుతున్నాం. కానీ ముందు తరంలో ఇలా రచయిత నుంచి దర్శకులు అయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు.

- Advertisement -

అయితే ఇప్పుడు బెజవాడ ప్రసన్న కుమార్ డైరెక్టర్ గా తాను ప్రూవ్ చేసుకునే దిశగా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీనికి కారణం ఏంటంటే బాక్సాఫీస్ వద్ద ప్రసన్న రాసిన సినిమాలు హిట్ అయినా కూడా దర్శకుడుగా సినిమాకు సంబంధించి ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం నాగార్జున చేస్తున్న నా సామిరంగా సినిమాకి డైరెక్టర్ గా ప్రసన్నకుమార్ చేయాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వలన రచయితగా మాత్రమే ప్రసన్న ఉంటున్నాడు.

దీనికి రీజన్ ఏంటి అని అంటే సినిమా బడ్జెట్ ను వేసినప్పుడు దాదాపు పేపర్ పైనే 50 కోట్ల వరకు బడ్జెట్ ను చూపించాడు అంట ప్రసన్న. లొకేషన్స్  ఖర్చు కూడా కాస్త ఎక్కువ ఉండటంతో.. పేపర్ మీద బడ్జెట్ అధికంగా కనబడింది. ఇదే సినిమాని డైరెక్షన్ స్కిల్స్ ఉన్న ఒక వ్యక్తి చేస్తే తక్కువ బడ్జెట్లో చేయొచ్చు అని బిజినెస్ మైండ్ ఉన్న నాగార్జున్ కి ఒక క్లారిటీ వచ్చి ఈ సినిమాని బెన్నీకి అప్పచెప్పారంట.

ఏదేమైనా కథను రాయటం కాకుండా ఆ కథను సినిమాగా మలచాలంటే అన్ని క్రాఫ్ట్ విషయాల్లోనూ సరైన క్లారిటీ ఉండాలనేది వాస్తవం. అల్టిమేట్ గా సినిమా అనేది ప్రేక్షకులకు వినోదం అయితే అది ప్రొడ్యూసర్ కి వ్యాపారం అవుతుంది. ప్రేక్షకులకు వినోదం అందించడంతో పాటు ప్రొడ్యూసర్ కి కూడా కొన్ని లాభాలను తెచ్చిపెట్టాలి. సో ఇలా ఒక సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వాలంటే అన్ని కోణాల్లోనూ ఆలోచించగలగాలి అనేది వాస్తవం. ఇకపోతే తదుపరి సినిమా కైనా లో బడ్జెట్ లో ఒక సినిమాను ఎలా తీయాలి అనే దానిపై ఒక క్లారిటీ ఉంటే చాలామంది దర్శకులు లా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు