Geetha Arts: ఎప్పటికి మీరే ఉంటారా ఇంకో నిర్మాత రాకుడదా.?

సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ ఈ రంగాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు.  సినిమా అనేది కొందరికి వ్యాపారం.  కొందరికి జ్ఞాపకం. మరికొందరికి వ్యాపకం.  ఇంకొందరికి జీవితం.  సినిమా ఫిలిం ఇండస్ట్రీలో నిలద్రొక్కుకోవడానికి  చాలామంది డైరెక్టర్స్ నానా కష్టాలు పడుతూ ఉంటారు.  ఎట్టకేలకు ఒక అవకాశాన్ని దక్కించుకొని దర్శకుడుగా తమ పేరును చూసి మురిసిపోతూ ఉంటారు.

అలానే ఇండస్ట్రీలో నిర్మాతలకు కూడా కొన్ని కష్టాలు ఉంటాయి.  ఆ కష్టాలు చాలామందికి వినిపించవు, కనిపించవు. ఎందుకంటే ఒక దర్శకుడు బయటకు వచ్చినంత స్థాయిలో ఒక నిర్మాత బయటకు రాలేరు.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులు పేర్లు చెప్పమంటే టక్కున ఒక పదిమంది దర్శకులు పేర్లు చెప్తారు ఇప్పటి తరం సినీ ప్రేమికులు.  అదే ప్రొడ్యూసర్ పేర్లు చెప్పమంటే ఒక “రామనాయుడు, అశ్విని దత్, అల్లు అరవింద్, సురేష్ బాబు, సూర్యదేవర రాధాకృష్ణ, నాగ వంశీ ఇలా చెప్తూ వస్తారు.

ఇప్పటివరకు ప్రస్తావించిన పేర్లన్నీ కూడా కొద్దొ గొప్ప మంచి సినిమాలు తీసిన నిర్మాతలవి.  కానీ ఒక సినిమాని నమ్మి, ఒక ఆలోచనను నమ్మి సినిమాగా నిర్మించి ఒక వైపు పేరు ఇంకో వైపు ఆర్థికంగా లాభపడడంలో కూడా కొంతమంది నిర్మాతలు ముందడుగు వేసే ప్రయత్నాలు చేస్తుంటారు.  అలానే రీసెంట్ గా ఒక నిర్మాత ఇదే ఆలోచనలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.  ఆయనే గౌరీ కృష్ణ.

- Advertisement -

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కొచ్చిన పొలిమేర సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  మూఢనమ్మకాలు చేతబడులు  కోవాలో వచ్చిన ఈ సినిమా హాట్స్టార్లో విపరీతంగా ఆకట్టుకుంది.  దానికి లీడుగా వచ్చిన పొలిమేర-2  సినిమా థియేటర్లో రిలీజ్ అయింది.  పొలిమేర – 2  ప్రొడ్యూసర్ వేరు,  పొలిమేర-2 ప్రొడ్యూసర్ వేరు.  అయితే పొలిమేర-2 కి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన గౌరీ కృష్ణ పై చాలా ఒత్తిళ్లు మొదలయ్యాయి.  ఎక్కడి నుంచో కొంత మనీని  తీసుకొచ్చి  సినిమాను ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఆయా ఫైనాన్సియర్స్  గౌరీ కృష్ణను చాలా ఇబ్బంది పెడుతూ వచ్చారు.

ఎట్టకేలకు పొలిమేర -2 సినిమా కమర్షియల్ గా బానే వర్కౌట్ అయింది.  అలానే సినిమాలు పొలిమేర -3  లీడ్ కూడా ఇచ్చారు.  ఈ తరుణంలో గౌరీ కృష్ణ నుంచి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన గీతా  ఆర్ట్స్ పార్ట్ -3 ని లాక్కుని  నిర్మించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది.  సక్సెస్ లో ఉన్న ఒక సినిమాను తీసుకొని ఒక నిర్మాతను తొక్కటం ఎంతవరకు కరెక్టు అనేది కొంతమంది అభిప్రాయం.

సినిమా ఒక ఫ్లోలో వెళుతున్న తరుణంలో, నిర్మాతగా తనను తాను నిలదొక్కుకొని ప్రయత్నం చేస్తున్న తరుణంలో, పార్ట్ – 3 కి లీడ్ బావుందని చెప్పి కథను తమ వైపు లాక్కుని సినిమాను ప్రొడ్యూస్ చేయడం గీతా ఆర్ట్స్ కి ఎంతవరకు సమంజసం.? అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ఏదేమైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా నిలద్రొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తి నుంచి ప్రాజెక్ట్ లాక్కోవడం అనేది కరక్ట్ కాదు అనేది చాలామంది భావన.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు