Polimera 2: సినిమా సక్సెస్ పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

“మా ఊరి పొలిమేర”. వారం కిందటి వరకు ఈ సినిమా పేరు గురించి పెద్దగా జనాలకి తెలీదు. కానీ ఇప్పుడు థియేటర్ల వద్ద జనం క్యూ కడుతున్నారు. చిన్న సినిమా అయినా సాలిడ్ కలెక్షన్లతో మోత మోగించింది. లాస్ట్ ఇయర్ ఓటిటి లో చిన్న సినిమా గా రిలీజ్ అయిన ఈ సినిమా, ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి రెస్పాన్స్ అందుకున్నాక, రెండో పార్ట్ పై ప్రేక్షకుల్లో ఏర్పడ్డ అంచనాలని క్యాష్ చేసుకుని థియేటర్స్ లో రిలీజ్ అయిన పొలిమేర2 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోగా, 10 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి, చాలా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతుంది.

ఇక పొలిమేర2 సక్సెస్ తర్వాత ఆ చిత్ర నిర్మాత ‘గౌరీ కృష్ణ’ సంచలన వ్యాఖ్యలు చేసారు. మీడియా తో మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘మా ఊరి పొలిమేర 2 హిట్ అవుతుందనే ఆశలు, మొదటి నుండి మాకు లేవు. బాగా ఎఫర్ట్ పెట్టి సినిమా చేయాలి అనుకున్నాం.

- Advertisement -

Polimera2: జస్ట్ 3 డేస్ టార్గెట్ ఔట్!

పైగా మొదట సరైన ఓటీటీ ఆఫర్ కూడా రాలేదు. పార్ట్ 1 ఓటీటీలో రిలీజ్ అయ్యి .. పార్ట్ 2 థియేటర్లలో రిలీజ్ చేయడం అంటే రిస్క్ అని, థియేటర్లకు జనాలు రారు అని చాలా మంది అన్నారు. అయితే ఇప్పుడు థియేటర్లలో తమ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అందుకుంది. దాంతో ఓటీటీ ఆఫర్లు బాగా వస్తున్నాయి అని అన్నారు.

ఇక పొలిమేర2 ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పైన కోటికి పైగా లాభాలు అందుకోగా, లాంగ్ రన్ లో బిజినెస్ కి డబల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక ఓటిటి లో కూడా పొలిమేర1 కి పది రేట్లు ఎక్కువ ఆఫర్ వచ్చే అవకాశం ఉంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు