Ravi Teja’s Eagle: మాస్ మహారాజాలో ఈ మార్పుకి కారణమేంటి?

మాస్ మహారాజా రవితేజ… ఎలాంటి సపొర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, టైర్ 1 హీరోగా ఎదిగిన తీరు ఎందరికో ఇన్స్పరేషన్. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన వాళ్లు.. రవితేజను చూసి, ఆయనల ఎదుగుదలను చూసి, తాము కూడా రవితేజలా అవ్వాలి అని అనుకుంటారు. రవితేజ కూడా ఈ మధ్య కాలంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తున్నాడు. నిజానికి రవితేజలో ఉన్న కామెడీ యాంగిల్.. ఆయన డైలాగ్ ఫ్లో చాలా మందికి నచ్చుతుంది. అందుకే కిక్, వెంకీ లాంటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.

మాస్ మహారాజా నుంచి ఆడియన్స్ ఫైట్స్ కోరుకుంటారు. అలాగే కామెడీని కూడా కోరుకుంటారు. అయితే ప్రస్తుతం రవితేజ సీరియస్ పాత్రలోపైనే ఫోకస్ పెట్టాడు. ఆయన చివరి మూడు సినిమాలు చూస్తే.. కామెడీని పక్కన పెట్టి, సీరియస్ పాత్రలపైనే ఫోకస్ చేసినట్టు తెలిసిపోతుంది.

Read More: Raviteja: ఈగల్ టీజర్: ఇది విధ్వంసం మాత్రమే..

- Advertisement -

రావణాసుర సినిమాలో అయితే మాస్ మహారాజా ఏకంగా నెగిటివ్ షేడ్స్ లో కనిపించాడు. అలాగే ఇటీవల వచ్చిన టైగర్ నాగేశ్వర రావులో కూడా రవితేజ సీరియస్ లుక్ లోనే కనిపించాడు. ఇక రాబోయే ఈగల్ సినిమాలోనూ రవితేజ సీరియస్ గానే కనిపిచబోతున్నాడు. ఈ రోజు (సోమవారం) ఈగల్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది.

ఈ టీజర్ చూస్తే.. రవితేజ గత సినిమాల్లానే కామెడీని పక్కన పెట్టి, సీరియస్ లుక్ లోనే ఈగల్ మూవీ చేశాడని అర్థమవుతుంది. అయితే సమయం వచ్చినప్పుడల్లా కామెడీని ట్రై చేసే రవితేజ సడన్ గా సీరియస్ పాత్రలు ఎందుకు చేస్తున్నాడు అనే ప్రశ్న ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

Read More:Raviteja: ‘టైగర్’ ఇంకా పోరాడుతున్నాడు!

ఇప్పటి వరకు రవితేజ కామెడీ జానర్ లో ఎన్ని సినిమాలు చేసినా, తెలుగు ఆడియన్స్ పరిధి వరకు మాత్రమే వెళ్లాడు. అదే పాన్ ఇండియా స్థాయి సీరియస్ కంటెంట్ తో సినిమాలు చేసి, నార్త్ లో కూడా మార్కెట్ పెంచుకోవాలని రవితేజ చూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే బ్యాక్ టూ బ్యాక్ సీరియస్ పాత్రలనే ఎంచుకుంటున్నాడని సమాచారం.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

Have you noticed the changes in Mass Maharaja Ravi Teja’s movies?

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు