Raviteja: ‘టైగర్’ ఇంకా పోరాడుతున్నాడు!

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ అయ్యి మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువయ్యాయని ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. దాంతో పండగ సెలవుల్లో రఫ్ఫాడించిన ఈ సినిమా, ఆ తర్వాత నెమ్మదించింది.

అయితే దసరా అయిపోగానే టైగర్ నాగేశ్వరరావు సినిమా భారీ నష్టాల్లో కూరుకుపోయిందని, నిర్మాత కి 30 కోట్ల వారికి నష్టం వాటిల్లిందని రకరకాల పుకార్లు వచ్చాయి. నిజానికి టైగర్ నాగేశ్వరరావు సినిమాకి కేవలం 37కోట్ల బిజినెస్ మాత్రమే జరిగింది. 38 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫస్ట్ వీక్ పరవాలేదనిపించే ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అయితే భగవంత్ కేసరి, లియో సినిమాల పోటీ వల్ల ఓపెనింగ్స్ తక్కువ వచ్చాయని చెప్పొచ్చు.

ఒకవేళ టైగర్ నాగేశ్వరరావు సోలో గా రిలీజ్ అయి ఉంటే వచ్చిన టాక్ కి ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయి ఉండేది. ఇక టైగర్ నాగేశ్వరరావు ఇప్పుడు కూడా వీకెండ్ లో కొన్ని థియేటర్లలో మంచి కలెక్షన్లు సాధించింది. ఈ ఆదివారం కూడా కోటికి పైగా షేర్ సాధించిన టైగర్ రిలీజ్ అయిన పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా 23.67 కోట్ల షేర్ సాధించింది. అయితే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 14కోట్లు కావాలి. అది అసాధ్యం, కానీ ఓవరాల్ గా మరో రెండు కోట్ల వరకు రాబట్టొచ్చు. అంటే టైగర్ నాగేశ్వరరావు భారీ నష్టాలతో కాదు గాని 12 కోట్ల వరకు నష్టపోయే ఛాన్స్ ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు