OG: ఇకపై పాన్ ఇండియా రేంజ్ లో పేరు వినిపిస్తుంది

రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు సుజీత్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని తన తర్వాత సినిమా పాన్ ఇండియా ప్రభాస్ తో సాహు చేశాడు. బాహుబలి అంచనాలను తన మీద వేసుకొని కూడా సాహో సినిమాతో సాహసం చేశాడు సుజిత్. సాహో సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేదు. కానీ హిందీలో మాత్రం సాహో సినిమాకి వేరే లెవెల్లో రెస్పాన్స్ అండ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు అదే రెస్పాన్స్ సుజీత్ చేస్తున్న “ఓజి” సినిమాకు కలిసొస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రేజ్ గురించి వివరించాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఒక పండగ వాతావరణం నెలకొంటుంది.
కానీ ఇదంతా తెలుగు ప్రేక్షకులు వరకే. కానీ ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటినుంచి ఒక లెక్క అనుకునేలా జరగనుంది.

రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నీ రీమిక్ సినిమాలు. ఈ సినిమాలు పై అంచనాల అంతంత మాత్రం ఉన్నా కూడా తెలుగులో పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ను బట్టి ఆడాయి. ఇప్పుడు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ఒరిజినల్ సినిమా చేస్తున్నాడు. అదే ఓజి. దానికి తోడు పవన్ కళ్యాణ్ కి బీభత్సమైన ఫ్యాన్ అయిన సుజీత్ దర్శకత్వంలో చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

- Advertisement -

మామూలుగా పవన్ కళ్యాణ్ కి తెలుగులో క్రేజ్ ఉండటం సహజం. హిందీలో మార్కెట్ కూడా తక్కువ, కానీ “ఓజి” సినిమా డిజిటల్ మార్కెట్ రైట్స్ దాదాపు 120 కోట్ల వరకు అమ్ముడుపోయాయి అనేది తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్న సంస్థే, ఓజి రైట్స్ ను దక్కించుకున్నట్లు సమాచారం. పవన్ కెరియర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకి రాని బజ్ ఈ సినిమాకి వస్తుంది.

దీని కారణం సుజిత్ టేకింగ్ అండ్ రీసెంట్ గా రిలీజైన “ఓజి” టీజర్. “ఓజి” టీజర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి షాట్ , ప్రతి ఫ్రేమ్ లో కూడా ఒక రిచ్నెస్ కనిపించేటట్టు సుజీత్ దానిని డిజైన్ చేశాడు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా వ్యాప్తంగా “ఓజి” సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. “ఓజి” సినిమా రిలీజ్ అయితే ఇప్పటివరకు తెలుగులో మాత్రమే వినిపించిన పేరు, ప్యాన్ ఇండియా రేంజ్ లో వినిపిస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmif

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు