OG Movie: తెలుగు ఇండస్ట్రీ లో ‘OG’ కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది – వెంకట్

టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘OG’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ళ తరువాత ఒక గ్యాంగ్ స్టర్ గా నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కూడా ఓ రేంజ్ లో ఉండి ఫ్యాన్స్ కి మాస్ ఐ ఫీస్ట్ ని ఇచ్చింది.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని దానయ్య నిర్మిస్తున్నాడు. ఇకపోతే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుండి ఇమ్రాన్ హష్మీ, కోలీవుడ్ నుండి ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, కీలక పాత్రల్లో నటిస్తుండగా, ఈ సినిమాలో మరో టాలీవుడ్ నటుడు నటిస్తున్నట్టు తెలిసింది.

అతనే వెంకట్. కెరీర్ బిగినింగ్ లో పలు చిత్రాల్లో హీరోగా నటించిన వెంకట్, మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య చిత్రంలో తమ్ముడిగా పాపులర్ అయ్యాడు.

- Advertisement -

ఇక వెంకట్ ఓజి గురించి మాట్లాడుతూ, అప్పుడు అన్నయ్యతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఇప్పుడు కళ్యాణ్ అన్న సినిమాలో కూడా నటిస్తుండడం హ్యాపీగా ఉందన్నాడు. ఇక ఈ సినిమాలో తాను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నానని, ఆల్రెడీ తన కి సంబంధించిన షూట్ కూడా చాలా వరకు అయిపోయిందని అన్నాడు.

ఇక ఓజి సినిమా తెలుగులో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని, కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా ఫుల్ మాస్ స్టఫ్ ఇవ్వబోతుందని, ఇక తన రోల్ గురించి మాత్రం అడగొద్దని, చెప్తే సుజీత్ నన్ను చంపేస్తాడని వెంకట్ అన్నాడు. ఇక ఇప్పటికే భారీ క్యాస్టింగ్ తో నిండి పోయిన og సెట్స్ కి పవన్ మాత్రం రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల రావడం లేదు. అయినప్పటికీ సుజీత్ గ్యాప్ తీసుకోకుండా పవన్ లేని సీన్స్ షూట్ చేస్తున్నాడు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు