Suma Kanakala Controversy: స్నాక్స్ ఇష్యూతో డిప్రెషన్‌లోకి సుమ… 15 లక్షలు నష్టం?

సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో ప్రీ రిలీస్ ఈవెంట్స్ నుంచి సక్సెస్ మీట్స్ వరకు, టివి షోస్ నుంచి అవార్డు ఫంక్షన్స్ వరకు ఎన్నో ఈవెంట్స్ హోస్ట్ చేసిన యాంకర్ సుమ అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. స్టార్ మహిళ షోతో ఫామిలీ ఆడియన్స్ ని… క్యాష్, సుమ అడ్డా షోస్ లతో యూత్ ని చాకచక్యంగా ఆకట్టుకుంది సుమ. ఎంత మంది యంగ్ యాంకర్స్ వచ్చినా సరే, సుమ మాత్రం క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నిజంగా చెప్పలంటే రోజు రోజుకు పెరిగింది. ఇప్పటికి కూడా ఏ సినిమా ఈవెంట్ అయినా సరే, ఫాస్ట్ ఆప్షన్ సుమనే. మలయాళీ అయినప్పటికీ, తెలుగు అనర్గలంగా మాట్లాడి, మాటలతో మాయ చేసే టాలెంట్ ఉంది సుమకు. అందుకే సుమ అంత ప్రత్యేకం.

అయితే ఇటీవల సుమ గురించి వార్తల్లో ఏవేవో వినిపిస్తున్నాయి. ఈ మధ్య జరిగిన ”ఆదికేశవ” సినిమా ఈవెంట్ లో రిపోర్టర్లకి స్నాక్స్ ఏర్పాటు చేయగా, రిపోర్టర్లు ఆ స్నాక్ బ్రేక్ ని కాస్త ఎక్కువ సేపు తీసుకోగా, ఫన్నీ గా, ”మేము పెట్టిన స్నాక్స్ ని, లంచ్ లా తింటున్న రిపోర్టర్లు త్వరగా వచ్చి కెమెరాలు పెడితే ఈవెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు” అనటం తో రిపోర్టర్లు కాస్త హర్ట్ అయ్యి, అసహనం వ్యక్తం చేసారు. కొంత మంది అయితే సుమకు నెగిటివ్ గా ఎన్నో వార్తలను రాసుకొచ్చారు.

అయితే ఈ సమయంలో కొంత మంది సుమకు అనుకూలంగా కూడా నిలబడ్డారు. సుమ ఈ వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉందని, గతంలో గతంలో తన కొడుకు నటిస్తున్న సినిమా ఈవెంట్ లో సుమ కూతురు కూడా హాజరు అయింది. ఇంకా రిపోర్టర్లు అందరూ, తన కూతురు లావుగా ఉంది అంటూ.. బాడీ షేమింగ్ చేస్తూ ఎన్నో ఆర్టికల్స్ రాసారు. దీంతో రిపొర్టర్ల మీద సుమకు కాస్త అసహనం ఉందని, ఆ కారణంతో అలా ఓ మాట అనొచ్చు అని సపొర్ట్ చేస్తున్నారు.

- Advertisement -

అయితే ఇక మీద తన కొడుకు సినిమా ప్రమోషన్లు, ఈవెంట్లు ఉంటాయి అనే విషయాన్నీ మనసులో పెట్టుకొని, తన కొడుకుకి ఇబ్బంది అవ్వకూడదు అని ఆ విషయానికి సుమ అప్పుడే సారీ కూడా చెప్పటం జరిగింది. అయినప్పటికీ రిపోర్టర్ లు సుమ సరదాగా అన్న ఆ మాటకి అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని పలువురు భావిస్తున్నారు.

ఈ వ్యవహారం జరిగి, సుమ క్షమపణలు చెప్పి రోజులు గడుస్తున్నాయి. అయినా సుమ పై దీని ప్రభావం తగ్గడం లేదు. ఆమె గురించి ఇంకా నెగటివిటీ ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల బాధపడిన సుమ గత నాలుగైదు రోజులుగా బయటకి రావడం లేదు. ఈవెంట్స్ కోసం మూవీ యూనిట్ వాళ్లు ఫోన్ చేసినా స్పందించడం లేదట.

నిజానికి ”కీడా కోలా” ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సుమ నే హోస్ట్ చేయాలి. కానీ ఆమె రాలేదు. ఇలా మిస్ చేసుకున్న ఈవెంట్ల వల్ల ఆమెకు రూ.15 లక్షల వరకు లాస్ అని తెలుస్తుంది. ఇంత చిన్న విషయాన్ని అంత పెద్దది చేయాల్సిన అవసరం ఎం ఉంది అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఎంతో మంది సెలెబ్రెటీలను వారి బ్రేకింగ్ న్యూస్ కోసం ఎన్నెన్నో అంటూ ఆర్టికల్స్ రాసే రిపోర్టర్లు వారిని సరదా గా అన్న ఒక్క మాటకే ఇంతలా రరాధ్ధాంతం చేయాలా అని కూడా పలువురు నెటిజెన్ లు ప్రశ్నిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు