Nani: హాయ్ నాన్న థర్డ్ సింగిల్ వచ్చేది అప్పుడే

నేచురల్ స్టార్ నాని మరియు మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సినిమా  “హాయ్ నాన్న”. ఈ సినిమాతో  శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ , ట్రైలర్ ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాతో నాని లో మరో వేరియేషన్ చూడొచ్చు అనిపించేలా టీజర్ ఆసక్తి రేకెత్తించింది.

రీసెంట్ టైమ్స్ లో నాని ఎంచుకున్న స్క్రిప్ట్స్ చూస్తుంటే, నాని సినిమాలపైనా ఆసక్తి పెరుగుతూ వస్తుంది. “హాయ్ నాన్న” సినిమా
పాన్-ఇండియన్ మూవీగా తెరకెక్కింది. ఈ సినిమాను డిసెంబర్ 7, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సినిమా నుండి ఇదివరకే రిలీజైన “సమయమా”, “గాజుబొమ్మ”  పాటలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుండి  “అమ్మడి” అనే రొమాంటిక్ మెలోడీని నవంబర్ 4, 2023న ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌లలో పోస్ట్ చేసారు.

- Advertisement -

హాయ్ నాన్న లో జయరామ్, బేబీ కియారా ఖన్నా, ప్రియదర్శి, అంగద్ బేడీ మరియు మరికొందరు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా, హృదయం ఫేమ్ “హేషమ్ అబ్దుల్ వహాబ్” సంగీతం అందిస్తున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు