Salaar Movie: సలార్‌పై డార్లింగ్ అసంతృప్తి.. బుజ్జగింపు పనిలో ప్రొడ్యూసర్లు?

టాలీవుడ్‌లో మాత్రమే కాదు, సినీ ప్రపంచానికి మోస్ట్ అవెయిటెడ్ మూవీ సలార్. ఇప్పటికే వాయిదాలతో విసిగు పుట్టించిన సలార్.. ఫైనల్ గా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. సలార్ మూవీ రిలీజ్ పై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వచ్చింది. కానీ, అది రిలీజ్ అయ్యేంత వరకు నమ్మకం లేదు దొర అన్నట్టే ఉంది. ఎందుకంటే, అదే రోజు బాలీవుడ్ బాద్ షా… వరుసగా రెండు సార్లు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కొల్లగొట్టిన షారుక్ ఖాన్ నటించిన డుంకి సినిమా రిలీజ్ అవుతుంది.

అలాగే హాలీవుడ్ నుంచి కూడా పోటీ ఉంది. హాలీవుడ్ లోనే కాదు, మన దేశంలో కూడా కలెక్షన్ల సునామి స్రుష్టించిన ఆక్వామెన్ నుంచి మరో సినిమా రాబోతుంది. Aquaman and the Lost Kingdom అనే పేరుతో ఆక్వామెన్ 2 డిసెంబర్ 22నే రాబోతుంది. అంటే ప్రభాస్ సలార్ సినిమాకు ఇది భారీ దెబ్బ. ప్రభాస్ తన సలార్ సినిమాను ఒంటరిగా బరిలో దింపాలని అనుకున్నాడు. తన మార్కెట్ తెలుగులో పాటు సౌత్ లో ఎలాగూ ఉంది. నార్త్ స్టేట్స్ లో డార్లింగ్ మార్కెట్ ఎలా ఉందో… సాహో, రాధేశ్యామ్ చూస్తే తెలిసిపోతుంది.

అలాంటిది నార్త్ నుంచి ఎలాంటి పోటీ ఉండొద్దు అని ప్రభాస్ ప్లాన్. అయితే బాలీవుడ్ నుంచి షారుక్ హ్యాట్రిక్ 1000 కోట్లు కొట్టే విధంగా డుంకి రిలీజ్ చేస్తున్నాడు. ఓపెనింగ్స్ అయితే రెండు సినిమాలకు రావొచ్చు. కానీ, లాంగ్ రన్ లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం అంత ఈజీ కాదు. అందుకే ప్రభాస్ కొంత వరకు ఆలోచిస్తున్నాడట. అంతే కాదు… సలార్ ఫైనల్ అఫుట్ పట్ల డార్లింగ్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై ప్రశాంత్ నీల్‌తో పాటు నిర్మాతలతో కూడా మాట్లాడరట.

- Advertisement -

ప్రభాస్ అసంతృప్తి వల్లే.. సినిమాను సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కు వాయిదా వేశారనే టాక్ కూడా ఉంది. అలాగే ప్రభాస్ కు ఎంతో పట్టు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కువ బిజినెస్ జరగలేదు. ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డులను అన్నింటినీ సలార్ క్రాస్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ, ఫస్ట్ మెట్టు బిజినెస్ లోని సలార్ తెలిపోయింది. ఇలా అన్నింటిలో సలార్ వెనకబాటు ఉండటంతో ప్రభాస్ అసంతృప్తి మరింత పెరిగిపోయిందట. అవరసమైతే రిలీజ్ డేట్ ను మరోసారి మార్చాలని కూడా ప్రభాస్ అంటున్నారని టాక్.

దీంతో ప్రొడ్యూసర్లు ప్రభాస్ ను బుజ్జగించే పనిలో ఉన్నారట. నవంబర్ 6న విదేశాల నుంచి ప్రభాస్ హైదరాబాద్ కి రానున్నారు. అప్పుడు ప్రభాస్ తో ప్రొడ్యూసర్లు సలార్ సినిమా గురించి చర్చించి, ప్రమోషన్స్ స్టార్ట్ చేయించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు