Santosh Shobhan: ఈ సినిమాతోనే ఒక హిట్ అందుకుంటాడా.?

గోల్కొండ హై స్కూల్ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యాడు సంతోష్ శోభన్.  ప్రముఖ దర్శకుడు శోభన్ కొడుకే ఈ సంతోష్ శోభన్.

“తాను నేను” సినిమాతో హీరోగా పరిచయమైన సంతోష్ “పేపర్ బాయ్” సినిమాతో మంచి గుర్తింపును సాధించాడు. ఆ తర్వాత సంతోష్  ఇప్పటివరకు చాలా సినిమాలు చేశాడు.  అన్ని సినిమాలు కూడా కొద్దో గొప్ప ఆడాయి తప్ప తనకంటూ సూపర్ హిట్ అంటూ ఒక సినిమా లేక పోయింది.

ప్రస్తుతం సంతోష్ శోభన్ కొత్త చిత్రం పూజ జరిగింది. రీసెంట్ గా బేబీ సినిమాతో హిట్టు అందుకున్న దర్శకుడు “సాయి రాజేష్” ఈ సినిమాకు కథను, స్క్రీన్ ప్లేను అందిస్తున్నాడు.  ఈ సినిమాను సుమన్ పాతూరి అనే కొత్త దర్శకుడు డైరెక్టర్ చేస్తున్నాడు . సాయి రాజేష్  రచయిత గా  మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

సాయి రాజేష్ తో పాటు  బేబీ సినిమా నిర్మాత ఎస్ కే ఎన్  కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.  ఈ సినిమా కార్యక్రమం పొద్దున్న ముహూర్తం జరిగింది.  దీనికి ముఖ్య అతిథులుగా నాగచైతన్య హాజరయ్యాడు. నాగచైతన్యతో పాటు దర్శకులు  హరీష్ శంకర్, చందు మొండేటి వంటి దర్శకులు హాజరయ్యారు. ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ , ఆ పోస్టర్ పై “కొన్ని ప్రేమకథలు జీవిత కాలం వెంటాడుతాయి” అని రాసుకొచ్చారు. ఈ సినిమాలో సంతోష్ సరసన హారిక అలేఖ్య నటిస్తుంది.  ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తో అయినా సంతోష్ శోభన్ “బేబీ” రేంజ్ లో హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు