Santosh Shobhan: “ప్రేమ్ కుమార్” గా వస్తున్నాడు. దీనితోనైనా హిట్ కొడతాడా?

టాలీవుడ్ లో వరుస పరాజయాలు అందుకుంటున్న హీరోల్లో సంతోష్ శోభన్ ఒకరు. పేపర్ బాయ్, ఏక్ మినీ కథతో మంచి హిట్స్ అందుకున్న సంతోష్ శోభన్ ఆ తర్వాత మాత్రం వరుస ప్లాప్ లను అందుకున్నాడు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో పలకరించిన సంతోష్ ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు. కాగా ఇప్పుడు మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు “ప్రేమ్ కుమార్” అనే సినిమాతో రాబోతున్నాడు.

తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ పూర్తి స్థాయి కామెడీతో ఉండి ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో హీరోకి పెళ్లి చేసుకోవాలని ఎన్ని సంబంధాలు చుసినా, పెళ్లి టైమ్ వచ్చే సరికి ఎదో ఒక విధంగా చెడిపోతాయి. ఆ సందర్భంలో హీరోకి హీరోయిన్ మ్యాట్రిమోనీ ద్వారా వేరే వాళ్ళకి మ్యాచెస్ చూస్తుంటే పరిచయమవుతుంది. అప్పుడు ఫైనల్ గా హీరో ఆ అమ్మాయిని దక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేసాడన్నదే సినిమా.

- Advertisement -

ఇక ప్రేమ్ కుమార్ సినిమాను అభిషేక్ మహర్షి దర్శకత్వం వహించగా, శరంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శివ ప్రసాద్ పన్నీరు నిర్మించారు. ఇక ఈ సినిమాలో రాశి సింగ్ హీరోయిన్ గా నటించగా, ఎస్. అనంత శ్రీకర్ మ్యూజిక్ అందించాడు. ఇక సినిమా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. షూటింగ్ మొత్తం పూర్తయిపోయిన ఈ సినిమా ఆగష్టు 18న విడుదలకు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో నైనా సంతోష్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు