Raviteja: పాన్ ఇండియా మూవీ ఫస్ట్ లుక్ అప్డేట్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. దోచేయ్ సినిమా ఫేమ్ వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు జి. వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా గా అయిదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా లో భారీ తారాగణం నటిస్తున్నారు. బాలీవుడ్ నుంచి అనుపమ్ ఖేర్, జిష్షు సేన్ గుప్త, అలాగే నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ లు నటిస్తున్నారు. విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ భార్య “రేణు దేశాయ్” ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించడం జరిగింది.

పాన్ ఇండియా సినిమా గా రూపొందిస్తున్న ఈ సినిమా 1970 లలో స్టువర్ట్‌పురంలో పేరుమోసిన గజ దొంగ “టైగర్ నాగేశ్వరరావు” అనే వ్యక్తి యొక్క బయోపిక్ గా రూపొందుతుంది. నాగేశ్వరరావు పోలీసు కస్టడీ నుండి తప్పించుకోవడంలో సిద్ధ హస్తుడు. మరియు 1970 లలో చెన్నై జైలు నుండి తప్పించుకోవడం వల్ల అతనికి టైగర్ అనే బిరుదును సంపాదించిపెట్టింది.

తాజాగా ఈ సినిమానుండి మోస్ట్ అవైటెడ్ అప్ డేట్ వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు యొక్క ఫస్ట్ లుక్ ని మే 24న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే అది ఫస్ట్ లుక్ టీజర్ ఆ? లేదా పోస్టర్ తోనే సరిపెడతారా అన్నది తెలియదు. రావణాసుర ఫలితంతో నిరాశ చెందిన రవితేజ ఈ సినిమాపై గట్టి నమ్మకంగా ఉన్నాడు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు 2023 అక్టోబర్ 20న దసరా కానుకగా విడుదలకు సిద్ధం అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు