Ramabanam: డింపుల్ టాలీవుడ్ ని వదిలేస్తుందా?

డింపుల్ హయతి.. గల్ఫ్ అనే చిన్న సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి, గద్దల కొండ గణేష్ లో ఐటెం సాంగ్ ద్వారా పాపులర్ అయింది డింపుల్ హయతి. అయితే హైదరాబాద్ కి చెందిన ఈ తెలుగమ్మాయి మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన “ఖిలాడీ” సినిమాతో హీరోయిన్ గా మారింది. రవితేజ లాంటి స్టార్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో చాలా సంతోషించింది. స్టార్ హీరోయిన్ అవ్వాలని ఆశపడింది. కానీ ఈ సినిమా ఫలితం తన ఆశలపై నీళ్లు చల్లింది. మొదటి సినిమానే డిజాస్టర్ కావడంతో నిరాశ చెందింది.

అయినా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని శ్రీవాస్ డైరెక్షన్లో “రామబాణం” చిత్రంలో హీరోయిన్ గా నటించింది. రొటీన్ కంటెంట్ ఉన్న ఈ సినిమా కూడా ఆడకపోవడంతో ఈ అమ్మడికి ఎటు పాలుపోవడంలేదు. ఒక తెలుగు హీరోయిన్ అయి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వకపోవడం వల్ల కలత చెందింది. ప్రస్తుతం డింపుల్ వేరే సినిమాలు కూడా చెయ్యట్లేదు. తెలుగు సినిమాల్లో సినిమాలు హిట్ అయితేనే ఛాన్సులు వస్తాయి. అలాంటిది ఇప్పటివరకు ఒక్క హిట్ లేక ఐరన్ లెగ్ ట్యాగ్ తెచ్చుకున్న డింపుల్ కి ఛాన్సులొస్తాయా లేదా అనేది అనుమానమే.

ఒకప్పుడు ఇలాగే టాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నించి ఇక్కడ ఆఫర్లు రాక తెలుగు హీరోయిన్లైన అంజలి, ఇషా రెబ్బ, ఐశ్వర్య రాజేష్ తమిళ్ లోకి వెళ్లి అవకాశాలు దక్కించుకుని హిట్లు కొట్టారు. ఇప్పుడు డింపుల్ కూడా ఇదే బాట పడుతుందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే ఒకవేళ వేరే భాషల్లో హిట్టు కొట్టినా మళ్ళీ టాలీవుడ్ లో ఆఫర్ వస్తే చేస్తుందా లేదా అనేది తెలియదు.  తెలుగు హీరోయిన్లకు సొంత గడ్డపైనే అవకాశాలు రావడం కరువయ్యాయని, తెలుగమ్మాయిలు ఇతర ఇండస్ట్రీల వైపు మొగ్గు చూపడానికి ఇదే కారణం అని, అందుకే ను తెలుగులో కూడా పెద్దగా సినిమా చేయట్లేదని ఐశ్వర్య రాజేష్ ఇంతకు ముందే చెప్పిన విషయం తెలిసిందే. మరి డింపుల్ హయతి తెలుగులో అవకాశాల కోసం ఓపిగ్గా ఇంకా వెయిట్ చేస్తుందా, లేదా ఇతర భాషలవైపు మొగ్గు చూపుతుందా అనేది చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు