Baby: నేషనల్ క్రష్ క్రేజ్ ని వాడుకుంటున్న బేబీ

ఆనంద్ దేవరకకొండ, హీరోగా “కొబ్బరి మట్ట” ఫేమ్ సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ బేబీ. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై తనకు హీరోయిన్ గా మొదటి సినిమా ఇది. ఇందులో ఈ అమ్మాయి డీ గ్లామరైజ్ రోల్ చేసింది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూట్ అయిపోగా పెద్ద సినిమాల పోటీ వలన రీలీజ్ డేట్ పోస్టుపోన్డ్ అవుతూ వచ్చింది. “మాస్ మూవీ ఎంటర్టైన్మెంట్స్” బ్యానర్ పై శ్రీనివాస కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

చాలా రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ దక్కించుకొని బేబీ సినిమా పై అంచనాలు పెంచేసింది. ఇక పాటలు కూడా ఒక్క్కొకటిగా విడుదల చేసి సినిమాపై హైప్ ని పెంచేస్తున్నారు. ఇక బేబీ సినిమాను సమ్మర్ చివరలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న మేకర్స్ ప్రస్తుతం ప్రమోషన్ల మీద దృష్టి పెట్టారు.

తాజాగా ఈ సినిమాలోని మూడవ సాంగ్ అయిన “ప్రేమిస్తున్నా” అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు. ఇక దానికోసం బేబీ యూనిట్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ ను వాడుకుంటున్నారు. పుష్ప తో నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించి నేషనల్ క్రష్ అయిన రష్మిక తో ఈ సాంగ్ లాంచ్ చేయిస్తే వ్యూస్ కూడా బాగా వస్తాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. రీసెంట్ గా రామబాణం చిత్రంలోని ఓ పాటను ఆ చిత్ర యూనిట్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల తో లాంచ్ చేయించారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ ని ఫాలో అవుతూ రష్మిక తో సాంగ్ రిలీజ్ చేయిస్తున్నారు. ఇక బేబీ మూవీ లోని పాటని మే 16న సాయంత్రం 5 గంటలకు రష్మికతో విడుదల చేయిస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు