Adah Sharma: అలాంటి పిచ్చి కోరికలు లేవంటున్న ది కేరళ స్టోరీ హీరోయిన్

ఆదా శర్మ.. ప్రస్తుతం ఈ పేరు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి కారణం ది కేరళ స్టోరీ. అనేక వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమాలో ఆదా శర్మ ప్రధాన పాత్ర చేసింది. ఈ చిత్రం విడుదల తర్వాత కూడా అనేక కాంట్రవర్సీలకు గురి అవుతుంది. కొన్ని రాష్ట్రాలు ఈ చిత్రాన్ని ఇప్పటికే బ్యాన్ చేశాయి. ఇది ఇలా ఉండగా,  కాంట్రవర్సీ చిత్రం ది కేరళ స్టోరీ ఆదా శర్మ కెరీర్ కు బాగానే హెల్ప్ అవుతుంది. ఆదా శర్మ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 12 ఏళ్లు గడుస్తుంది.

అప్పటి నుంచి అనేక సినిమాల్లో నటించింది. కానీ, ఎప్పుడూ కూడా మంచి గుర్తింపు రాలేదు. అందం, ప్రతిభ ఉన్నా.. లక్ లేకపోవడం వల్లేనేమో.. సరైన హిట్ ఆమెకు 12 ఏళ్ల కాలంలో రాలేదు. దీంతో వెబ్ సిరీస్ లు, చిన్న చిన్న సినిమాలు చూస్తే తన కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. కానీ, ఇప్పుడు వచ్చిన కాంట్రవర్సీల్ చిత్రం ది కేరళ స్టోరీతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తన కెరీర్ కు సంబంధించి చేసన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ మారాయి.

తన కెరీర్ పై తనకు భారీ ఆశలే లేవని ఆదా శర్మ చెప్పింది. అలాగే “కానీ ప్రేక్షకులు నన్ను ప్రతిసారి కొత్తగా చూడాలని అనుకుంటారు. నాపై ప్రేక్షకులకు అలాంటి నమ్మకం ఉంది. దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. నేను చేసే సినిమాను ఎప్పుడూ చివరిది గానే భావిస్తాను. ఎందకంటే, నాకు మరో అవకాశం వస్తుందో రాదో తెలియదు కదా. దర్శక నిర్మాతలు మళ్లీ నన్ను ఎంపిక చేస్తారని చెప్పలేం. అలాగే నాకు స్టార్ హీరోలతో నటించాలనే పిచ్చి కోరికలేం లేవు. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలు దొరికితే చాలు అని అనుకుంటాను. అందు కోసం చిన్న సినిమాలు, చిన్న పాత్రలు అయినా చేస్తాను” అంటూ ఆదా శర్మ చెప్పుకొచ్చింది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు