Salaar Postponed Again: వెనక్కి తగ్గడు నిజమే… మరీ సాగదీత ఎందుకు?

సలార్ మళ్లీ వాయిదా పడబోతుంది… గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్త ఇది. ఇందులో ఎంత వరకు నిజం ఉందని తెలియదు. కానీ, రిలీజ్ డేట్ కి ఇంకా 46 రోజులు మాత్రమే ఉంది. కానీ, భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ పనులు స్టార్ట్ కాలేదు. పక్క ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ నుంచి ప్రభాస్ కి పోటీగా వస్తున్న షారుక్ ఖాన్ డుంకి మాత్రం టీజర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ లో ఓ అడుగు ముందుకేసింది.

Read More: Salaar vs Dunki: ప్రభాస్, షారుక్‌లకు మొగుడు వస్తున్నాడు

కానీ, సలార్ సాగదీత మాత్రం ఇంకా తగ్గడం లేదు. ఇదిగో ఫస్ట్ సింగిల్… అదిగో టీజర్ అంటూ రోజులు గడిపేస్తున్నారే గానీ, అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. ఇవి చూసిన తర్వాత సలార్ మళ్లీ వాయిదా పడబోతుంది అంటూ వస్తున్న వార్తను ఆడియన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మాల్సి వస్తుంది. అందుకే ఆ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

250 కోట్ల బడ్జెట్ తో వస్తున్న మూవీ అంటే… ప్రొడ్యూసర్లు కనీసం రెండు నెలల ముందు నుంచి అయిన ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారు. కానీ, ఇక్కడ సలార్ విషయంలో మాత్రం ప్రొడ్యూసర్లు చాలా కూల్ గా ఉంటున్నారు. ఇంకా 46 రోజులే ఉన్నా… ప్రమోషన్స్ విషయంలో చలనం లేకుండా ఉండటంపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సలార్ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Read More: Salaar :మరో ప్రయోగానికి రెడీ అవుతున్న ప్రభాస్

నిజానికి డిసెంబర్ 22న ఉన్న పోటీని చూసి మేకర్స్ అలర్ట్ అవ్వాలి. నార్త్ స్టేట్స్ తో పాటు ఓవర్సీస్ లో బలంగా కనిపిస్తున్న షారుక్ ఖాన్ మూవీతో పాటు హాలీవుడ్ నుంచి కూడా ఓ సినిమా పోటీలో ఉండబోతుంది. అదే ఆక్వామెన్ 2. ఇది షారుక్ ఖాన్ కే కాదు… సలార్ కలెక్షన్లపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అంటే… బాక్సాఫీస్ వద్ద మూడు భారీ సినిమాలు ఉన్నప్పుడు ప్రమోషన్స్ అదే రేంజ్ లో ఉండాలి కదా.. ఇదే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

సలార్ మేకర్స్ సాగదీత చేయడం మానేసి… స్పీడ్ పెంచి.. డుంకి, ఆక్వామెన్ కు పోటీ ఇచ్చేలా హైప్ వచ్చేలా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అంటున్నారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు