Salar :మరో ప్రయోగానికి రెడీ అవుతున్న ప్రభాస్

ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఫిలిం మేకర్స్ అందరికి మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. అందరు హీరోలు తమ కెరీర్ లో ఒక్కోమెట్టు ఎక్కుతూ వెళ్తుంటే.. ప్రభాస్ మాత్రం బాహుబలి సినిమాతో డైరెక్ట్ గా ల్యాడర్ ఎక్కి ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడు.  బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ చేసిన సాహూ సినిమా తెలుగులో యావరేజ్ గా ఆడిన, కానీ హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ప్రభాస్ రాధా కృష్ణ అనే డైరెక్టర్ తో కలిసి రాధేశ్యామ్ అనే తీశారు. యాక్షన్ సినిమాలలో ప్రభాస్ ని చూసి, చూసి ఉన్న ప్రేక్షకులకి కొత్త ఎక్స్ పీరియెన్స్ ని ఇద్దామని ప్రభాస్ చేసిన ప్రయత్నం దారుణంగా ఫెయిల్ అయింది. భారీ అంచనాల మధ్య రిలీజైన రాధేశ్యామ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది.

అయితే ప్రస్తుతం ప్రభాస్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మహానటి సినిమాతో ఉత్తమ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే అనే సినిమా చేస్తున్నారు. అయితే ఇలాంటి పెద్ద డైరెక్టర్ల సినిమాలతో పాటు ప్రభాస్.. మారుతీ దర్శకత్వంలో ఒక హర్రర్ కామెడీ సినిమా కూడా చేస్తున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఈ మూడు సినిమాలు 70-80% షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. మరోపక్క ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా కూడా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్దమవుతుంది. ఆ తరువాత సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు విడుదల తేదీలతో రెడీ ఉండగా.. ప్రభాస్ మరో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరీ ప్రభాస్ ని ఒప్పిచ్చిన ఆ పెద్ద దర్శకుడు ఎవరు ?   అని అనుకుంటున్నారా.. అతను ఎవరో కాదు గతేడాది సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హను రాఘవపూడి.

- Advertisement -

లవ్ స్టోరీ సినిమాలకి కేర్ అఫ్ అడ్రెస్ గా హను రాఘవపూడికి మంచి పేరున్న విషయం అందరికి తెలిసిందే. కానీ రాధేశ్యామ్ ఆశించిన విజయం సాధించకపోయేసరికి ప్రభాస్ లవ్ స్టోరీ లకి దూరంగా ఉంటున్నాడంట. మొదటగా హను రాఘవపూడి కథకి ప్రభాస్ ఒప్పుకున్నాడనగానే న్యూస్ రాగానే లవ్ స్టోరీ ఏమో అనుకున్న ఫ్యాన్స్, ఆ కథ కాదు అని తెలియటంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రాజెక్ట్ కే షూటింగ్ అనంతంరం ఈ సినిమాకి సంబంధించి పనులు మొదలవ్వనున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించబోతున్నారు. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ మరో ప్రయోగాత్మక సినిమా చేయడానికి రెడీ అవుతున్నడని అనిపిస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు