Chiranjeevi: వైరల్ అవుతున్న భోళా శంకర్ లీక్స్

వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా సినిమా భోళా శంకర్. తమిళ హిట్ వేదాళం కి రీమేక్ గా తెరకెక్కతున్న ఈ సినిమాను ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుండగా, చిరు కు చెల్లెలిగా ప్రత్యేక పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుంన్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

శరవేగంగా జరుగుతున్న భోళా శంకర్ సినిమా షూట్ ప్రస్తుతం స్విట్జర్ ల్యాండ్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు లీకుల బెడద మాత్రం తప్పడం లేదు. ఇంతకు ముందే హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ లో చిరంజీవికి సంబంధించి కొన్ని స్టిల్స్ లీక్ అవగా, తాజాగా స్విట్జర్ ల్యాండ్ లో జరుగుతున్న పాట యొక్క వీడియో క్లిప్స్ లీక్ అయ్యాయి. అయితే ఈ పాట ఒక మెలోడీ సాంగ్ అని లీక్ అయిన ఆడియో ద్వారా అర్థమవుతుంది. చిత్ర యూనిట్ ఇప్పటికైనా మేలుకొని లీకుల బెడదను తప్పించాలని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇక భోళా శంకర్ సినిమా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథాంశం తో చూపించనున్నారు. అయితే కొన్ని రోజులు భోళా శంకర్ సినిమా షూట్ కి మెగాస్టార్ బ్రేక్ ఇవ్వగా, ఆ గ్యాప్ లో సినిమా వాయిదా పడిందని ప్రచారం జరిగింది. కానీ మేడే రోజు విడుదల చేసిన స్టిల్ తో భోళా శంకర్ వాయిదా పడలేదని ఖచ్చితంగా అనుకున్న డేట్ కి మూవీని విడుదల చేస్తారని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమా టీజర్ జులై లో రాఖి పండుగ రోజు విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఆగస్ట్11 న విడుదలకు సిద్ధం అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు