Devara :ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ! వార్2 పై క్లారిటీ

ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ నింపే మరో ఎన్టీఆర్ సినిమా అప్డేట్ రానే వచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఫస్ట్ లుక్, మరియు టైటిల్ విడుదలైన విషయం తెలిసిందే. దేవర అనే టైటిల్ తో మాస్ అవతార్ తో విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన లభించింది.

ఎన్టీఆర్ యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఏంటో తెలుగు ప్రేక్షకులకి తెలియనిది కాదు. తన డైలాగ్ డెలివరీ, డాన్స్, ఫైట్స్ ఇలా ప్రతి క్రాఫ్ట్ లో ఎన్టీఆర్ ప్రావీణ్యుడు. అయితే ఇంత ప్రతిభావంతుడైన ఎన్టీఆర్ కి ఎప్పుడో రావాల్సిన రెకాగ్నేషన్ RRR సినిమాతో రీసెంట్ గానే వచ్చింది. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్లి టాలీవుడ్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కి గుర్తింపు తీసుకొచ్చింది అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కూడా గెలుచుకుంది.

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా తర్వాత, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. దేవర సినిమా తరువాత ఈ మూవీ షూటింగ్ మొదలవనుంది. అయితే ఇదిలా ఉండగా రీసెంట్ గానే బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ నుండి ఎన్టీఆర్ కి సినిమా అవకాశం వచ్చిన విషయం అందరికి తెలిసిందే.

- Advertisement -

గతంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సంబందించి పార్ట్ 2 చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.మల్టి స్టారర్ తెరకెక్కనున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో పాటు కలిసి నటించడానికి ఎన్టీఆర్ ని సంప్రదించారు. అయితే ఎన్టీఆర్ కూడా ఈ సినిమాపై సానుకూలంగానే స్పందించరట, కానీ ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అఫీషియల్ న్యూస్ రాలేదు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్బంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెబుతూ “తొందరలోనే యుద్దభూమిలో కలుద్దాం, పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా” అంటూ ట్వీట్ చేయడంతో ఎన్టీఆర్ వార్ లో హృతిక్ రోషన్ తో కలిసి నటించబోతున్నట్టు కన్ఫామ్ అయినట్టే అనిపిస్తుంది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు