NTR31: ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ అప్పట్నుంచే..

జూనియర్ ఎన్టీఆర్ కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి అందరికి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ విడుదల కాకముందే వీరి కాంబోలో మూవీ అనౌన్స్ మెంట్ జరగగా, వారు చేతిలో ఉన్న సినిమాలు విడుదలైన తర్వాత ఈ సినిమాను స్టార్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. 2022లో ఇటు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కాగా, అటు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ కూడా విడుదలై ఘన విజయం సాధించాయి. అయితే వీటి తర్వాత ఇద్దరు వేరే ప్రాజెక్టులతో మళ్ళీ బిజీ అయ్యారు. ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో “సలార్” సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” చిత్రం లో నటిస్తున్నాడు.

తాజాగా రిలీజ్ అయిన దేవర మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా 2024 సమ్మర్ లో విడుదలకు సిద్ధం అవుతుంది. అటు ప్రశాంత్ నీల్ తీస్తున్న “సలార్” కూడా 2024 లో విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలిసి పనిచేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలవుతుందని చిత్ర యూనిట్ కన్ ఫర్మ్ చేసారు.

భారీ పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కబోయే ఈ సినిమాను 2024 మార్చ్ నుండి షూట్ చేస్తారని చిత్ర యూనిట్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా తెలియచేసారు. ఇక కొరటాల శివ తో చేస్తున్న సినిమా పూర్తిగా కంప్లీట్ అయ్యాకే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లో అడుగుపెడతాడని తెలుస్తుంది. ఎన్టీఆర్31 సినిమాకి సంబంధించిన నటీనటుల వివరాలు ఇంకా బయటికి రాలేదు కానీ, ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటించబోతుందని ప్రచారంలో ఉంది. ఇది నిజమో కాదో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి కన్ఫర్మేషన్ రావాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు